యాప్నగరం

YSR Biopic Trolls: దర్శకుడు వేడుకున్నా ఆగని ట్రోలింగ్స్.. ‘యాత్ర’ను టార్గెట్ చేస్తూ ట్వీట్లు!

ఎన్టీఆర్, వైఎస్సార్ ఈ మట్టిలో పుట్టిన మాణిక్యాలని.. అలాంటి దిగ్గజాలను ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ, అగౌరవ పరచొద్దని ‘యాత్ర’ దర్శకుడు మహి వి.రాఘవ్ వేడుకున్నారు. కానీ మనోళ్లు వినరుకదా!

Samayam Telugu 8 Feb 2019, 10:49 am
తెలుగులో ఏ హీరో సినిమా విడుదలైన మరో హీరో అభిమానులు ట్విట్టర్‌లో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొంత మంది సినిమాను ఉద్దేశించి కామెంట్లు పెడుతూ ఉంటే.. మరికొంత మంది హీరోలను వ్యక్తిగతంగా దూషిస్తూ ట్వీట్లు చేస్తుంటారు. ఇలాంటి ట్వీట్ల కింద రెండు వర్గాల మాటల యుద్ధం మొదలైపోతుంది. వీళ్ల మాటల యుద్ధం కాదు కానీ మధ్యలో హీరోలను అగౌరవపరుస్తూ రచ్చరచ్చ చేస్తారు. ‘యాత్ర’ సినిమా విషయంలోనూ ఇలాంటిదేదో జరుగుతుందని దర్శకుడు మహి వి. రాఘవ్ ముందుగానే ఊహించారు. అందుకే ఎన్టీఆర్, వైఎస్సార్ అభిమానులు ఇలాంటి మాటల యుద్ధానికి దిగకుండా వారిని గౌరవించాలని ఒక లేఖ కూడా రాశారు.
Samayam Telugu YSR_Biopic


ఎన్టీఆర్, వైఎస్సార్ ఈ మట్టిలో పుట్టిన మాణిక్యాలని.. అలాంటి దిగ్గజాలను ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ, అగౌరవ పరచొద్దని వేడుకున్నారు. కానీ మనోళ్లు వినరుకదా! ‘యన్.టి.ఆర్ - కథానాయకుడు’ విడుదలైనప్పుడు ఎలా ప్రవర్తించారో ఇప్పుడు కూడా అలాగే ట్వీట్లేస్తున్నారు. ఆ మహానేతను అగౌరవపరుస్తూ ట్వీట్లు చేస్తున్నారు. సినిమాపై బురదజల్లుతున్నారు. వాస్తవానికి ఇలా ట్రోల్ చేసేవారు కనీసం సినిమా కూడా చూసుండరు. మరో నేతపై ఉన్న అభిమానంతోనో.. ఈ నేత, ఆయన కుమారుడిపై ఉన్న ద్వేషంతోనో ఈ ట్రోలింగులు చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలోనూ ఇదే జరిగింది. మన భావాలను వ్యక్తపరచడానికి సామాజిక వేదిక ఒకటి వచ్చేసరికి హద్దులు మరిచి కామెంట్లు పెడుతూ గొప్పవ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ఇలా చేయడం ఎంత వరకు సమంజసమో వాళ్లే ఆలోచించాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.