యాప్నగరం

బ్రహ్మోత్సవం మూవీకి 'సెల్ఫ్ కట్టింగ్'

మహేష్ బాబు ఫ్యాన్స్‌ని తెగ ఊరిస్తూ వస్తున్న సినిమా బ్రహ్మోత్సవం. మే 7న.. అంటే రేపు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్

Samayam Telugu 6 May 2016, 2:04 pm
మహేష్ బాబు ఫ్యాన్స్‌ని తెగ ఊరిస్తూ వస్తున్న సినిమా బ్రహ్మోత్సవం. మే 7న.. అంటే రేపు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆడియో విడుదల జరుపుకోనున్న ఈ సినిమా ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. లేటెస్ట్ న్యూస్ అప్‌డేట్స్ ప్రకారం సెన్సార్ బోర్డ్ విధించే కొన్ని తరహాల కట్టింగ్స్ కన్నా ముందే ఈ సినిమాకి సెల్ఫ్ కట్టింగ్‌కి ప్లాన్ చేశారట బ్రహ్మోత్సవం మూవీ మేకర్స్.
Samayam Telugu two songs trimmed from mahesh babus brahmotsavam movie
బ్రహ్మోత్సవం మూవీకి 'సెల్ఫ్ కట్టింగ్'


వాస్తవానికి ఈ సినిమాలో మొత్తం 8 పాటలున్నాయి. కానీ అందులోంచి సినిమాలో ఓ రెండు పాటల్ని కట్ చేసినట్టు తెలుస్తోంది. మామూలుగా అయితే సినిమా నిడివి 2 గంటల 35 నిమిషాలుగా వుంది. అయితే, ఇంత భారీ నిడివి ఆడియెన్స్‌కి బోర్ కొట్టించే ప్రమాదం వుందని గ్రహించిన మేకర్స్.. ముందస్తుగానే సినిమాలోంచి రెండు పాటల్ని తొలగించి నిడివిని 2 గంటల 20 నిమిషాలకి తగ్గించినట్టు సమాచారం. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత సుభాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీవీపీ సినిమా నిర్మించిన బ్రహ్మోత్సవం మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.