యాప్నగరం

సెన్సార్ కట్ లేకుండా ‘అర్జున్ రెడ్డి’ వస్తున్నాడు!

బోల్డ్ సీన్లతో యూత్‌‌లో తెగ క్రేజ్ సంపాదించుకున్న అర్జున్ రెడ్డి సినిమా ఎలాంటి సెన్సార్ కత్తిరింపులు లేకుండా....

TNN 10 Oct 2017, 11:20 am
పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. ‘అర్జున్ రెడ్డి’తో భారీ క్రేజ్ సంపాదించాడు. యూత్‌ను ఆకట్టుకునే కంటెంట్‌తో భారీ హిట్ కొట్టి తనెంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా బాగుందని కొందరు చెబితే.. మరికొందరు మరీ ఇంత బోల్డ్‌గానా అంటూ విమర్శించారు. రాజకీయంగానూ ఈ సినిమా పెద్ద దుమారం లేపింది. ఈ చిత్రాన్ని నిషేధించాలని వీహెచ్ లాంటి రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. వివాదాలను కూడా అనుకూలంగా మలుచుకొని ‘అర్జున్ రెడ్డి’ భారీ కలెక్షన్లను రాబట్టింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి.. నిర్మాతకు లాభాల పంట పండించింది.
Samayam Telugu uncensored arjun reddy movie will be available on amazon prime video from october 13
సెన్సార్ కట్ లేకుండా ‘అర్జున్ రెడ్డి’ వస్తున్నాడు!


సెన్సార్ కారణంగా కొన్ని సన్నివేశాలను తొలగించాల్సి వచ్చినప్పటికీ.. ఈ సినిమా నిడివి 3 గంటలకుపైగా ఉంది. అప్పటికీ లెంగ్త్ తగ్గించడం కోసం ఈ చిత్రంలోని చాలా సీన్లను తీసేయాల్సి వచ్చింది. ఇలా సెన్సార్ కటింగ్‌లు, తొలగించిన దృశ్యాలు లేకుండా అర్జున్ రెడ్డి సినిమా చూడాలని అనుకుంటున్నారా? అమోజాన్‌ ప్రైమ్ వీడియోస్‌ అక్టోబరు 13న సెన్సార్‌ చేయని ఈ సినిమా కాపీని విడుదల చేస్తోంది. దీనికి ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేస్తోంది. మరి సెన్సార్ కట్ లేకుండా ‘అర్జున్ రెడ్డి’ ఇంకెంత హాట్‌గా, బోల్డ్‌గా ఉంటాడో!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.