యాప్నగరం

ఈ బడ్జెట్‌తో సినీ పరిశ్రమకి లాభం లేదు -ముఖేష్ భట్

ఇవాళ పార్లమెంట్‌లో అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రముఖ నిర్మాత ఒకరు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

TNN 1 Feb 2017, 8:01 pm
ఇవాళ పార్లమెంట్‌లో అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ముఖేష్ భట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. జైట్లీ ప్రసంగంలో అసలు బాలీవుడ్ ఊసే ఎత్తలేదని.. అతడి తీరు చూస్తే అసలు మేము ఒకరం ఉన్నామనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించినట్టుగానే అనిపించలేదని ఆవేదన వ్యక్తంచేశారు ముఖేష్ భట్.
Samayam Telugu union budget 2017 mukesh bhatt gets disappointed with this budget
ఈ బడ్జెట్‌తో సినీ పరిశ్రమకి లాభం లేదు -ముఖేష్ భట్


బడ్జెట్ ప్రకటన అనంతరం తనని సంప్రదించిన టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధితో మాట్లాడుతూ.. " సినీపరిశ్రమకు భారంగా మారిన పన్నులని సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం జరగకపోగా... కనీసం పరిశ్రమకి ఎటువంటి సహాయం ప్రకటించలేదు" అని తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.

" సినిమావాళ్లని ఎంతో ఇబ్బందికి గురి చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి సైతం గండికొడుతున్న పైరసీ పట్ల కూడా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. కొత్తగా ప్రారంభం అయ్యే సినిమా థియేటర్లపై కొంత టాక్స్ ఇన్‌సెంటీవ్స్ ప్రకటించాల్సిన అవసరం వుంది. కానీ అలా జరగలేదు. చైనాలో ప్రతీ నెల 16 థియేటర్లు ప్రారంభోత్సం జరుపుకుంటున్నాయి. కానీ మన దేశంలో మాత్రం వున్న థియేటర్లు మూతపడుతున్నాయి. హాలీవుడ్ సినిమాల్ని డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుండటం కూడా మన దేశంలో సినీపరిశ్రమని దెబ్బతీస్తోంది" అని తన ఆవేదనను వెలిబుచ్చారు ముఖేష్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.