యాప్నగరం

ఆ విషయాలు బయటకు వచ్చి చెప్పాలి!.. ఉపాసన కామెంట్స్ వైరల్

తాజాగా ఉపాసన ఎన్నో విషయాల మీద స్పందించింది. సమంతతో తనకున్న స్నేహం, సానీయాతో ఉన్న అనుబంధం గురించి ఉపాసన చెప్పుకొచ్చింది. తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి, అత్తవారిళ్లు, పుట్టింటి గురించి ఎన్నో విషయాలను పంచుకుంది.

Samayam Telugu 13 Nov 2021, 2:34 pm

ప్రధానాంశాలు:

  • సోషల్ మీడియాలో ఉపాసన వైరల్
  • మహిళలపై మెగా కోడలి కామెంట్
  • మగవారు సైతం అలా చెప్పాలన్న ఉపాసన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఆ విషయాలు బయటకు వచ్చి చెప్పాలి!.. ఉపాసన కామెంట్స్ వైరల్
upasana
మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. మీడియా చానెల్‌తో ఆమె మాట్లాడిన మాటలు, అందులో చెప్పిన విషయాలు, పర్సనల్ ప్రొఫెషనల్ విషయాల మీద స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది. ఇన్నాళ్లుగా అందరి మదిలో ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. పిల్లల్ని ఎందుకు కనడం లేదు అని ప్రశ్నించే వారికి మంచి సమాధానం ఇచ్చింది. అవన్నీ కూడా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి, వాటి గురించి ఎవ్వరికీ చెప్పాల్సిన పని లేదంటూ ఉపాసన తన అభిప్రాయాన్ని తెలిపింది
సంతోషకరమైన ఆ శుభవార్త సమయం వచ్చినప్పుడు వస్తుంది.. దాన్ని నేనే చెబుతాను అంటూ ఉపాసన తెలిపింది. అలా ఎన్నెన్నో విషయాల మీద ఉపాసన స్పందించింది. సమంతతో తనకున్న స్నేహం, సానీయాతో ఉన్న అనుబంధం గురించి ఉపాసన చెప్పుకొచ్చింది. తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి, అత్తవారిళ్లు, పుట్టింటి గురించి ఎన్నో విషయాలను పంచుకుంది.

అయితే మహిళల గురించి కొన్ని విషయాలను మాట్లాడింది. మహిళలు బయటకు వచ్చి.. మగవాళ్లు తమ శక్తి, సామర్థ్యం, వారే మా బలం అని చెబుతారు. కానీ మగవాళ్లు ఎప్పుడైనా బయటకు వచ్చి.. ఆడవాళ్లు తమ బలం అని చెబుతారా? కానీ చెప్పాలి. ఆ రోజులు రావాలి. అలాంటి సందర్భం, సమయం వచ్చినప్పుడే ఈ వివక్ష పోతుందని ఉపాసన తెలిపింది.

తనకు సానీయా అంటే ఎంతో ఇష్టం.. నెక్స్ట్ లెవెల్ అల్లరి చేస్తుందని ఉపానన అంది. ఇక సమంత నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాను.. ఆమెను చూసి ఇన్ స్పైర్ అవుతున్నాను అంటూ ఉపాసన ఎంతో గొప్పగా చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.