యాప్నగరం

ఫిబ్రవరిలో సినిమాలే .. సినిమాలు

ఒకప్పుడు టాలీవుడ్‌లో ఫిబ్రవరి నెలలో సినిమాలు రిలీజ్ చేయాలంటే వెనుకడుగు వేసేవారు. ఫిబ్రవరి అన్ సీజన్ అనే ఫీలింగ్ అందరిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది.

TNN 1 Feb 2017, 3:09 pm
ఒకప్పుడు టాలీవుడ్‌లో ఫిబ్రవరి నెలలో సినిమాలు రిలీజ్ చేయాలంటే వెనుకడుగు వేసేవారు. ఫిబ్రవరి అన్ సీజన్ అనే ఫీలింగ్ అందరిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది. గతేడాది ఎన్టీఆర్ 'టెంపర్' సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసి పెద్ద హిట్ కొట్టాడు. ఈఏడాదిలో కూడా ఫిబ్రవరి నెలలో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి మేకర్స్ ముందుకొస్తున్నారు. ముందుగా ఫిబ్రవరి 3న నాని నటించిన 'నేను లోకల్' సినిమా.. అలానే మోహన్ లాల్ నటించిన 'కనుపాప' సినిమాలు విడుదల కానున్నాయి.
Samayam Telugu upcoming telugu movies in february
ఫిబ్రవరిలో సినిమాలే .. సినిమాలు


ఆ తరువాత ఎన్నో వాయిదాల మీద వాయిదాలు పడుతున్న సూర్య 'సింగం 3' ఫిబ్రవరి 9న రాబోతుంది. ఆ మరుసటి రోజే నాగార్జున భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' రిలీజ్ కానుంది. ఆ మరుసటి వారం ఫిబ్రవరి 17న వరుసగా నాలుగు సినిమాలు రాబోతున్నాయి.

ముందుగా రానా 'ఘాజీ', మంచు మనోజ్ 'గుంటురోడు', రాజ్ తరుణ్ 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వీటితో పాటు మరో చిన్న సినిమా రాబోతుంది. ఇలా నెల మొత్తం బిజీగా ఉంటే ఫినిషింగ్ టచ్‌గా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తన 'విన్నర్' సినిమాతో ఫిబ్రవరి 24న రాబోతున్నాడు.

ఈ సినిమాలన్నింటిపైన ప్రేక్షకుల్లో భారీ అంచనలే ఉన్నాయి. ఇక ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ ప్రభావాన్ని ఏ విధంగా చూపించబోతున్నాయో తెలియాలంటే ఎక్కువరోజులు ఎదురుచూడక్కర్లేదు. మొత్తానికి సంక్రాంతి సినిమా పండగ జోష్‌‌ను ఎంజాయ్ చేసిన తెలుగు ప్రేక్షకులు ఫిబ్రవరిలో కూడా కంటిన్యూ చేయడానికి రెడీగా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.