యాప్నగరం

దసరా విషెస్ చెప్పిన ఉపాసన.. ఫ్యాన్స్ ప్రశ్నకు బదులేది?

అందరికీ దసరా శుభాకాంక్షలు.. చెర్రీ, నేను కలిసి సేవా సమాజ్ బాలికా నిలయంలో బతుకమ్మ వేడుకలు జరుపుకున్నాం అని ఉపాసన ట్వీట్ చేసింది. దీనికి మెగా ఫ్యాన్స్ ఇచ్చిన రిప్లయ్ ఇదే.

Samayam Telugu 18 Oct 2018, 1:44 pm
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ట్విట్టర్ ద్వారా దసరా శుభాకాంక్షలు తెలిపింది. చెర్రీకి సంబంధించి లేటెస్ట్ అప్‌‌డేట్స్‌ను ఆమె ఫ్యాన్స్‌తో పంచుకుంటుందనే సంగతి తెలిసిందే. సేవా సమాజ్ బాలికా నిలయంలో బుధవారం సాయంత్రం బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకున్నామని ఉపాసన చెప్పింది. చెర్రీ, తాను చిన్నారులతో కలిసి దిగిన ఫొటో, వీడియోను ట్వీట్ చేసింది.
Samayam Telugu upasana1


ఉపాసన ట్వీట్‌కు మెగా ఫ్యాన్స్ తమదైన శైలిలో బదులిచ్చారు. చెర్రీ దంపతులకు దసరా శుభాకాంక్షలు చెబుతూనే.. తమకు రామ్ చరణ్ 12వ చిత్రం ఫస్ట్ లుక్, సినిమా టైటిల్ కావాలని డిమాండ్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. బోయపాటి దర్శకత్వంలో ఆర్‌సీ12 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రంగస్థలం తర్వాత చరణ్ చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దీంతో ఈ సినిమా అప్‌డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.