యాప్నగరం

ఓవర్సీస్‌లో తెలుగోడి సత్తా..

తెలుగు ప్రేక్షకులు ఈ సంవత్సరం నిజమైన సంక్రాంతి పండుగను చేసుకున్నారు.

TNN 17 Jan 2017, 2:10 pm
తెలుగు ప్రేక్షకులు ఈ సంవత్సరం నిజమైన సంక్రాంతి పండుగను చేసుకున్నారు. సంక్రాంతి పండుగకు బాలయ్య- శాతకర్ణి , చిరంజీవి- ఖైదీ, శర్వానంద్- శతమానం భవతి వస్తున్నాయంటే సంక్రాంతి బరిలో నిలచేవారు ఎవరు? అంటూ ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. అయితే చివరికి అన్ని సినిమాలకు సూపర్ లిజల్ట్ ఇచ్చి అంతిమంగా మేమే సూపర్ హీరోస్ అని తీర్పు నిచ్చారు తెలుగు ప్రేక్షకులు.
Samayam Telugu us box office collection telugu films overseas collections
ఓవర్సీస్‌లో తెలుగోడి సత్తా..


అయితే ఇదివరకు తెలుగు సినిమా విడుదలౌతోందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హడావిడి కనిపించేది. నైజాం టాక్ ఏంటి? సీడెడ్‌లో రెస్ఫాన్స్ ఎలా ఉంది? అన్న చర్చలనే చూశాం. కాని ఇప్పుడు ఓవర్సీస్ నుండి ఏం రిపోర్ట్ వచ్చిందంటూ మొదట అటువైపు నుండి వచ్చిన కలెక్షన్స్‌ని బేస్ చేసుకుని సినిమా టాక్‌ని నిర్ణయిస్తున్నారు.

తాజాగా రిలీజైన ఇండియన్ సినిమాలు ముఖ్యంగా సంక్రాంతికి రిలీజ్ అయిన గౌతమి పుత్ర శాతకర్ణి, ఖైదీ నెం.150 , శతమానం భవతి సినిమాలు ఓవర్సీస్‌లో కలెక్షన్స్ సునామిని కంటిన్యూ చేస్తున్నాయి. ఓవర్సీస్ డిస్టిబ్యూటర్స్‌కి కాసులవర్షం కురిపిస్తున్నాయి.

తెలుగు సినిమా విడుదలౌతోందంటే అమరావతైనా.. హైదరాబాదైనా.. అమెరికా అయినా ఒకటే.. తేడా ఏం లేదు. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే అంటూ కొత్త కలెక్షన్స్ బట్టి తెలుస్తోంది. చిరంజీవి ఖైదీ నెం.150, బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి సినిమాలు ఊహించని విధంగా వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతున్నాయి.

ఇప్పటికే ఈ మూడు సినిమాలు 3.7 మిలియన్ డాలర్లు వసూళ్లను సాధించి ఓవర్సీస్‌లో ట్రేడ్ జనాలకు మైండ్ బ్లాంక్ అయ్యేట్లు చేశాయి. మెగాస్టార్ ఖైదీ నెం.150 చిత్రం 2.1 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. శాతకర్ణి 1.5 మిలియన్ డాలర్లను, శతమానం భవతి ఒక మిలియన్ చేరువలో ఉందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఈ లెక్కలు వీకెండ్ ఇంకా పెరగవచ్చని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.