యాప్నగరం

పవన్ స్థాయి వేరప్పా.. మీకంత లేదప్పా- రేణూదేశాయ్

గత కొంతకాలంలో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది రేణూ దేశాయ్. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణూ ఇటీవల సెకండ్ మ్యారేజ్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ..

TNN 13 Oct 2017, 6:20 pm
గత కొంతకాలంలో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది రేణూ దేశాయ్. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణూ ఇటీవల సెకండ్ మ్యారేజ్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇప్పటి వరకూ అలాంటి అవసరం రాలేదని.. అయితే ఒంటరి జీవితానికి తోడు ఎప్పటికైనా అవసరమనే అభిప్రాయాన్ని తెలియజేయడంతో పవన్ అభిమానులు ‘వదినమ్మా.. నువ్ ఎప్పటికీ మా అన్నకు వదినగానే ఉండాలమ్మా’ అంటూ కామెంట్ చేశారు. దీనిపై భిన్నాభిప్రాయాలను తెలియజేయండంతో వదినమ్మ అభిమానులపై ఆగ్రహాన్ని తెలియజేస్తూనే.. మగాళ్లు ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు ఆడవాళ్లు రెండో పెళ్లి చేసుకుంటే తప్పా? వాళ్ల మైండ్ సెట్ మారాలంటూ ఫైర్ అయ్యారు.
Samayam Telugu vadhinamma renu desai does the power style
పవన్ స్థాయి వేరప్పా.. మీకంత లేదప్పా- రేణూదేశాయ్


ఇక ఈ వివాదం ఇలా ఉంటే.. రేణూదేశాయ్ సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చిన తరువాత ఇటీవల మళ్లీ బుల్లి తెరపై స్టార్ మా ఛానెల్‌లో సెప్టెంబరు 30 నుంచి ప్రారంభమైన ‘నీతోనే డ్యాన్స్’ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ ప్రారంభంలో రేణూ దేశాయ్ తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన జానీ చిత్రంలోని పాట ఈ రేయి తీయనిది... ఈ చిరుగాలి మనసైనది అంటూ సాగే పాటకు డ్యాన్స్ చేసి తెలుగు ప్రేక్షకులను కనువిందు చేసింది.

తాజాగా ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో పవన్ కళ్యాణ్‌ స్టైల్‌పై పొగడ్తల వర్షం కురిపించింది. ఈ షోలో పాల్గొన్న ఓ కన్టెస్టెంట్ పవన్ కళ్యాణ్ నటించిన ‘బద్రి’ మూవీ గెటప్‌తో వచ్చి పవన్‌లా నటించే ప్రయత్నం చేశారు. దీంతో అదే మూవీలో పవన్ జతకట్టిన రేణూ.. మీరు పవన్‌ని ఇమిటేట్ చేయాలనుకుంటే ఆయన స్థాయి వేరు. మీరు ఎంత చేసినా పవన్ చేసిన దాంట్లో కనీసం 10 % కూడా చేయలేరు. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏంటీ.. ఆయన స్థాయి వేరు అంటూ పవన్ స్టైయిల్‌లో మెడపైకి చేయిపెట్టి మాజీ భర్త సిగ్నేచర్ స్టైల్‌ని దింపేసింది రేణూ దేశాయ్. దీంతో పవన్ అభిమానులు మా వదినమ్మకు మా అన్న అంటే ఎంత ఇష్టమో అంటూ ఈ వీడియో తెగ షేర్‌లు చేస్తున్నారు. ఆ వీడియోపై మీరూ ఓలుక్కేయండి.

. @renuudesai Does The Power Style!!! To know how it started watch #NeethoneDance This Week Sat & Sun at 9 PM @oppomobileindia pic.twitter.com/lJgVVcSocC — STAR MAA (@StarMaa) October 11, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.