యాప్నగరం

వరణ్ తేజ్ ‘మిస్టర్’ రిలీజ్ డేట్ ఫిక్స్

విభిన్న కథాంశాలతో అభిమానుల్ని మెప్పిస్తున్న యువ మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు

TNN 9 Feb 2017, 10:33 pm
విభిన్న కథాంశాలతో అభిమానుల్ని మెప్పిస్తున్న యువ మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. తాజాగా ఆయన శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్న మిస్టర్ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుందని ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు వరుణ్ తేజ్ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా అభిమానులతో తెలిపాడు.
Samayam Telugu varun tej mister movie release date announced
వరణ్ తేజ్ ‘మిస్టర్’ రిలీజ్ డేట్ ఫిక్స్


ఈ నెల ఆఖరికి షూటింగ్ పూర్తవుతుంది.. వచ్చే నెలలో ఆడియో.. అనంతరం ఏప్రిల్ 14న సినిమా విడుదల చేయనున్నట్లు వరుణ్ తేజ్ వివరించాడు. ఈ చిత్రంలో ముద్దుగుమ్మలు హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్‌తో ఆడిపాడనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తోన్న ఈ సినిమాను నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.