యాప్నగరం

ఆ సినిమా చూశాకా వెంకీకి నిద్ర పట్టలేదట!

సినిమాలు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ఏవో మర్చిపోలేని జ్ఞాపకాలని మిగుల్చుతాయి.

TNN 13 Aug 2017, 7:13 pm
సినిమాలు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ఏవో మర్చిపోలేని జ్ఞాపకాలని మిగుల్చుతాయి. థియేటర్ నుంచి ఇంటికొచ్చాకా కూడా సినిమాలోని సన్నివేశాలు అలా కళ్లముందు కదలాడుతూ వుంటాయి. తాజాగా నేనే రాజు నేనే మంత్రి సినిమా చూశాకా విక్టరీ వెంకటేష్‌కి కూడా అటువంటి ఫీలింగే కలిగిందట. విడుదల కన్నా ముందే 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా చూసిన వెంకీ థియేటర్ బయట పెద్దగా ఏమీ మాట్లాడకుండానే ఇంటికి వెళ్లిపోయారట. కానీ రాత్రి 10 గంటలప్పుడు ఆ చిత్ర దర్శకుడు తేజకి ఫోన్ చేసి, రానాకి ఓ మంచి హిట్ సినిమా ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారట వెంకీ. డైరెక్టర్ తేజనే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
Samayam Telugu venkatesh couldnt sleep after watching nrnm movie
ఆ సినిమా చూశాకా వెంకీకి నిద్ర పట్టలేదట!


నేనే రాజు నేనే మంత్రి విడుదల అనంతరం నిన్న జరిగిన సక్సెస్ మీట్‌లో తేజ మాట్లాడుతూ.. వెంకీకి తనకి మధ్య జరిగిన ఆ సంభాషణని వివరించారు. నేనే రాజు నేనే మంత్రి సినిమాలోని సన్నివేశాలు అలా కళ్లముందు కదలాడుతోంటే నిద్ర పట్టడంలేదని అన్నారట వెంకీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.