యాప్నగరం

విలక్షణ నటుడు ఓంపురి ఇక లేరు

బాలీవుడు విలక్షణ నటుడు ఓంపురి ఇక లేరు.

TNN 6 Jan 2017, 10:05 am
బాలీవుడు విలక్షణ నటుడు ఓంపురి ఇక లేరు. గురువారం రాత్రి ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. ఓంపురి గుండెపోటుతో మరణించారు. గురువారం ఓ సినిమా షూటింగ్ లో పాల్గొని సాయంత్రం ఇంటికి వచ్చిన ఓంపురి...శుక్రవారం ఉదయం తలుపులు తీయకపోవడంతో ఆయన డ్రైవర్ కు అనుమానం వచ్చి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు.
Samayam Telugu veteran actor om puri passes away bollywood mourns his demise
విలక్షణ నటుడు ఓంపురి ఇక లేరు


హర్యానాలోని అంబాలకు చెందిన ఓంపురి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

తెలుగులో అంకురం సినిమాలో ఆయన నటించారు.

1975 ఘషిరామ్ అనే మరాఠి సినిమాతో ఆయన ఆరంగేట్రం చేశారు. అర్థ్ సత్య్, మిర్చి మసాలా వంటి ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఓంపురి మరణాన్ని ఆయన స్నేహితుడు ఆశోకే పండిట్ ట్విట్టర్ ద్వారా వెల్లడి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.