Rao Ramesh-indraja movie:సెపరేట్ టైమింగ్, డిక్షన్‌తో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ‘రావు రమేష్’ (Rao Ramesh). ఇంచు మించు ఓ మాదిరి బడ్జెట్‌తో తెరకెక్కే ప్రతి సినిమాలోనూ ఆయనకో క్యారెక్టర్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇలా తన యూనిక్ యాక్టింగ్‌తో స్టార్ నటుడిగా ఎదిగిన రావు రమేష్.. సాదా సీదా సీన్లను కూడా ఇంటెన్స్ పెర్ఫామెన్స్‌తో నిలబెట్టగలరు. అయితే ఇన్ని రోజులు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రతిభ చూపిన ఆయన ప్రస్తుతం హీరోగా మారబోతున్నారు.
‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ (Maruthi Nagar Subramanyam) పేరుతో రాబోతున్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో లీడ్ రోల్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ఈ రోజు(శుక్రవారం) అధికారికంగా ప్రకటించారు. పీబీఆర్ సినిమాస్ బ్యానర్‌పై ‘హ్యాపీ వెడ్డింగ్’ ఫేమ్ లక్ష్మణ్ కార్య (Lakshman Karya) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. అంతేకాదు ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్, బ్యూటీ క్వీన్ ఇంద్రజ (Indraja) ఫిమేల్ లీడ్ క్యారెక్టర్లో కనిపించనుండటం విశేషం. ఈ సినిమా కథ మొత్తం ఒక మధ్య వయసు నిరుద్యోగి జీవితం చుట్టూ తిరుగుతుందని తెలుస్తుండగా.. 2 గంటల పాటు ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.
రావు రమేష్ విషయానికొస్తే.. పాన్-ఇండియన్ బ్లాక్ బస్టర్స్ ‘పుష్ప, KGF 2’ తదితర చిత్రాల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీయెస్ట్ ఆర్టిస్టుగా మారిపోయారు. ఏదేమైనా ప్రస్తుతం కంటెంట్ ఆధారిత చిత్రం ద్వారా తనే లీడ్ రోల్లో సినిమా చేస్తుండటం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ చిత్రం తప్పకుండా కెరీర్లో మరో మెట్టు ఎక్కుతున్న ఆయన విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిజానికి కెరీర్ మొదట్లో చిన్నా చితకా పాత్రలతో నెట్టుకొచ్చిన ఆయన.. ‘కొత్త బంగారులోకం’ చిత్రంలో చేసిన లెక్చరర్ పాత్రతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కామెడీ విలన్‌గా రాణిస్తున్నారు.

- Read Latest Tollywood Updates and Telugu News