యాప్నగరం

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు.. ప్రముఖ నటుడు ఏఎల్ రాఘవన్ కన్నుమూత

రాఘవన్ వయసు 80 ఏళ్లు. ఆయన భార్య రాజం కూడా సినిమా నటి. చివరిగా 2014లో విడుదలైన ఆడమా జైచోమాడ చిత్రంలో ఆయన పాట పాడారు.

Samayam Telugu 20 Jun 2020, 9:23 am
సినీ ఇండస్ట్రీని వరుస విషాదలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల క్రితం ప్రముఖ మలయాళ సినీ రచయిత, దర్శకుడు సాచీ కె.ఆర్.సచ్చిదానందన్ కన్నుమూశారు. ఆ చేదు వార్త మరువక ముందే... తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు, నటుడు ఏఎల్ రాఘవన్ నిన్న మరణించారు. రాఘవన్ వయసు 80 ఏళ్లు. నిన్న కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన కుప్పకూలారు. దీంతో ఆయనను భార్య ఎంఎన్ రాజం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాఘవన్ చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని చెన్నైలోని రోయపెట్టాలోని నివాసానికి తరలించారు.
Samayam Telugu భార్య రాజంతో ఏఎల్ రాఘవన్
al raghavan


1947లో గాయకుడిగా తన ప్రస్థానాన్ని రాఘవన్ ప్రారంభించారు. సింగర్‌గా వేలాది పాటలు పాడారు. చివరిగా 2014లో విడుదలైన ఆడమా జైచోమాడ చిత్రంలో సీన్ రోల్డాన్ సంగీత సారథ్యంలో 'నల్లా కేతుక్కా పాదం' అనే పాట పాడారు. నెంజిల్ ఒరు ఆలయంలో రాఘవన్ పాడిన ‘ఎంకిరుంతాళం వాళ్గా’ పాట ఎవర్ గ్రీన్‌ సాంగ్‌గా నిలిచిపోయింది. రాఘవన్ భార్య రాజం కూడా సినిమాల్లో నటించేవారు.

లెజండరీ సంగత దర్శకులైన కేవీ మహదేవన్, ఎస్‌ఎం సుబ్బానాయుడు, ఘంటసాల, విశ్వనాథ్‌-రామ్మూర్తి, టీవీ రాజు, ఎస్‌పీ కోదండపాణిలాంటి వారితో కలిసి పనిచేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, జిక్కి, పి.లీల వంటి ప్రముఖ గాయకులతో కలిపి ఎన్నో పాటలు పాడారు. ఎన్టీఆర్ నటించిన ‘నిండు మనసులు’, ‘నేనే మెనగాణ్ణి’ చిత్రాల్లో పాటలు పాడారు. ‘కులగౌరవం’ అనే తెలుగు సినిమాలో ‘హ్యాపీ లైఫ్’‌ అంటూ సాగే పాట‌ను ఎల్‌.ఆర్‌.ఈశ్వరితో కలిసి ఆయన ఆలపించారు. దీంతో అటు తమిళ ఇండస్ట్రీతోపాటు.. ఇటు తెలుగు పరిశ్రమకు చెందిన పలువురు రాఘవన్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.