యాప్నగరం

Vidudhala Trailer: సూపర్‌స్టార్‌ మెచ్చిన ‘విడుదల పార్ట్ 1’.. ప్రజాదళంతో పోలీసుల ఫైట్.. ఇంట్రెస్టింగ్ ట్రైలర్!

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘విడుదల’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఇప్పటికే తమిళ్‌లో రిలీజై సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రశంసలు అందుకుంది. ఇక త్వరలోనే తెలుగులో విడుదల కానుండగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Authored bySanthosh Damera | Samayam Telugu 8 Apr 2023, 1:14 pm

ప్రధానాంశాలు:

  • వెట్రిమారన్ లేటెస్ట్ చిత్రం ‘విడుదలై’
  • తమిళనాడులో విడుదలైన పార్ట్ 1
  • తెలుగులో ‘విడుదల’ పేరుతో రిలీజ్
  • తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vududhala Part 1 Trailer
Vududhala Part 1 Trailer: విడుదల పార్ట్ 1 ట్రైలర్
‘వడ చెన్నై, అసురన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన వెట్రిమారన్ (Vetrimaran) లేటెస్ట్ చిత్రం ‘విడుదలై’. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో సూరి ప్రధాన పాత్రలో నటించగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పీపుల్స్ ఆర్మీ నాయకుడిగా గెస్ట్ రోల్ పోషించాడు. తమిళ్‌లో ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర మొదటి భాగం ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఈ సినిమా చూసిన సూపర్‌స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) సైతం మూవీ టీమ్‌ను అభినందించారు. ఇదిలా ఉంటే మొదటిసారిగా వెట్రిమారన్ మూవీ తెలుగులో రిలీజ్ కాబోతోంది. ‘విడుదల’ (Vidudhala Part 1) పేరుతో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా అల్లు అరవింద్ (Allu Aravind).. పార్ట్1ను ఏప్రిల్ 15న విడుదల చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
విజయ్ సేతుపతి ఈ చిత్రంలో పీపుల్స్ ఆర్మీకి నాయకుడిగా పెరుమాళ్ మాస్టర్ అనే పాత్రలో కనిపించారు. సమస్యగా మారిన పీపుల్స్ ఆర్మీని సమూలంగా నిర్మూలించాలంటే ఆ దళ నాయకుడిని పట్టుకుంటే లేదా మట్టుపెడితే తప్ప సాధ్యం కాదని పోలీసులు ఓ అంచనాకు వస్తారు. మరోవైపు యాక్టర్ సూరి.. పై అధికారుల నుంచి వివక్ష ఎదుర్కొనే కానిస్టేబుల్‌గా కనిపించారు. మొత్తానికి వివిక్షకు గురయ్యే ప్రజల తరఫున పీపుల్స్ ఆర్మీ కార్యకలాపాలు ఉంటాయని తెలుస్తుండగా.. ఈ క్రమంలోనే పోలీసులకు, దళానికి మధ్య ఫైట్‌ను ప్రధానాంశంగా చూపించారు.

తమకు కొరకరాని కొయ్యగా మారిన పెరుమాళ్ మాస్టర్‌ను పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు, డ్యూటీలో వివక్షను ఎదుర్కొనే సూరి పాత్రలు ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. అయితే పెరుమాళ్‌ను ఎలాగైన పట్టుకోవాలని ‘ఆపరేషన్ ఘోస్ట్’ ప్రారంభించిన పోలీసులకు కానిస్టేబుల్ సూరి ఏ విధంగా సాయపడ్డాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇక ట్రైలర్‌లో భాగంగా.. ‘మనిషి పుట్టగానే ఒకరు పైన, ఇంకొకరు కింద, మరొకరు ఇంకా కింద అని వేరు చేసే మీరు వేర్పాటువాదులా? లేదా అందరం సమానమని పోరాడే మేము వేర్పాటు వాదులమా?’ అని విజయ్ సేతుపతి పోలీసులతో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మొత్తానికి తెలుగు ట్రైలర్ అదిరిపోగా.. డైరెక్టర్ వెట్రిమారన్ మరోసారి డిఫరెంట్ స్టోరీని వాస్తవికంగా చిత్రీకరించారు. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్స్‌పై ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. మరి తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.


రచయిత గురించి
Santhosh Damera
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్\u200cటైన్\u200cమెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్\u200cడేట్స్, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, లైఫ్\u200cస్టైల్ స్టోరీస్, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.