యాప్నగరం

Ashritha Daggubati: ప్రేమంటే ఇదేరా!! కూతురు లవ్ మ్యారేజ్‌కి వెంకీ గ్రీన్ సిగ్నల్!

విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లిపీటలు ఎక్కబోతుందా? ఆమె ప్రేమించింది ఎవర్నో తెలుసా?

Samayam Telugu 22 Sep 2018, 4:49 pm
‘ప్రేమ తో రా.. ప్రేమించుకుందాం రా.. పెళ్లి చేసుకుందాం.. ప్రేమింటే ఇదేరా.. కలిసుందాం రా..’ లాంటి ప్రేమ కథా చిత్రాలతో విక్టరీ పేరును సార్ధకం చేసుకున్నారు వెంకటేష్. ప్రేమ కథా చిత్రాలకు ఆయన పెట్టింది పేరు. తన రీల్ లైఫ్ ప్రేమకథల్ని సుఖాంతం చేసిన విక్టరీ వెంకటేష్.. రియల్ లైఫ్‌లో తన కూతురు ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి పీట‌లెక్క‌బోతుంద‌ట.
Samayam Telugu వెంకటేష్

హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆశ్రిత.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పెద్దలు వివాహానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. తాజాగా వెంకటేష్ అన్న సురేష్ బాబు.. సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పెళ్లి ఖాయం చేసుకున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. అబ్బాయి తండ్రి రఘురామి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్నేహితుడు కావడంతో త్వరలో అశ్రిత నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగున్నాయట. అయితే ఈ ప్రేమ వివాహంపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఇరు కుటుంబం సభ్యులు ఎలాంటి స్పందన తెలియజేయలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.