యాప్నగరం

జయలలితగా ‘విద్యాబాలన్’!

ప్రస్తుతం జయలలిత జీవిత ఆధారంగా ఏకకాలంలో మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి.

Samayam Telugu 13 Dec 2018, 9:55 am
జయలలిత.. ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పురుచ్చి తలైవి అంటూ తమిళ ప్రజలతో పిలుపించుకున్న కోమలవల్లి అలియాస్ జయలలిత. సినీ రంగం నుంచి వచ్చి ఎమ్‌జీఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె తమిళులకు ఆరాధ్య దైవం. అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబరు 5, 2016న ఆమె కన్నుమూశారు. ప్రస్తుతం జయలలిత జీవిత ఆధారంగా ఏకకాలంలో మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి.
Samayam Telugu vidyabalan


ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్న సినిమాలో జయలలితగా నిత్యా మీనన్ నటిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. మరోవైపు సీనియర్ దర్శకుడు భారతిరాజా కూడా ఓ సినిమా తీసే ఏర్పాట్లలో ఉన్నారు. ఏఎల్ విజయ్ మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇటీవలే స్క్రిప్ట్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే జయలలిత కుటుంబీకుల అనుమతి తీసుకుని షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్‌జీఆర్‌గా అరవిందస్వామిని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జయలలిత జయంతి(ఫిబ్రవరి 24) రోజున ఈ సినిమాకు సంబంధించి ప్రకటన చేయనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి ‘అమ్మా ఎండ్రాల్ అన్బు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఏడాది లోపు చిత్రీకరణ పూర్తిచేసి 2020, ఫిబ్రవరి 24న విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసున్నట్లు సమాచారం.

విద్యాబాలన్ ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నారు. నందమూరి తారక రామారావు సతీమణి బసవ తారకం పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.