యాప్నగరం

డర్టీ బ్యూటీతో రజినీకాంత్!

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'రోబో 2' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే రజినీకాంత్ కబాలి మూవీ దర్శకుడు రంజిత్‌తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

TNN 21 Feb 2017, 6:21 pm
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'రోబో 2' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే రజినీకాంత్ కబాలి మూవీ దర్శకుడు రంజిత్‌తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కబాలికి సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. కాస్టింగ్ విషయంలో టీం ఎంతో జాగ్రత్త తీసుకుంటోంది. ముఖ్యంగా రజనీతో జతకట్టబోయే హీరోయిన్ కోసం గట్టి ప్రయత్నాలే చేసింది యూనిట్.
Samayam Telugu vidya balan to star opposite rajinikanth in kabali offshoot
డర్టీ బ్యూటీతో రజినీకాంత్!


కబాలి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టేతో కలిసి నటించిన రజినీకాంత్ 'కబాలి 2' కోసం విద్యాబాలన్‌తో జత కట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విద్యాబాలన్‌ను ఈ విషయమై సంప్రదించడం.. దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని చెబుతున్నారు. అఫీషియల్‌గా ఈ విషయాన్ని త్వరలోనే తెలియజేయనున్నారు. ఇదే నిజమైతే విద్యాబాలన్ నటిస్తోన్న తొలి కోలీవుడ్ సినిమా ఇదే అవుతుంది. రజినీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభంకానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.