యాప్నగరం

ఇందిరాగాంధీగా ఆ స్టార్ హీరోయిన్!

దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జీవితంపై సీనియర్ జర్నలిస్టు సాగరిక ఘోష్ రచించిన పుస్తకం రైట్స్ ను

TNN 11 Jan 2018, 4:20 pm
దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జీవితంపై సీనియర్ జర్నలిస్టు సాగరిక ఘోష్ రచించిన పుస్తకం రైట్స్ ను కొనుగోలు చేసింది విద్యాబాలన్. నటిగా జాతీయ అవార్డును అందుకుని, వరస పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తున్న విద్య ఇప్పుడు ఒకింత సంచలన నిర్ణయాన్నే తీసుకుంది. ఇందిర పై సాగరిక రాసిన పుస్తకం ఆధారంగా ఒక సినిమాను చేయాలని విద్యాబాలన్ నిర్ణయించుకుందట. అటు నిర్మాతగానే కాకుండా, ఇందిర పాత్రను కూడా తనే పోషించాలని విద్యాబాలన్ భావిస్తుండటం విశేషం.
Samayam Telugu vidyabalan to make a movie on indiragandhi
ఇందిరాగాంధీగా ఆ స్టార్ హీరోయిన్!


అయితే ఈ కాన్సెప్ట్ ను సినిమాగా తీయాలా? లేక వెబ్ సీరిస్ గా రూపొందించాలా? అనే అంశంపై ఇంకా ఏం నిర్ణయించుకోలేదని విద్యాబాలన్ ప్రకటించింది. కానీ ఇందిరపై తమ సినిమా లేదా వెబ్ సీరిస్ రావడం మాత్రం ఖాయమని ఆమె ప్రకటించింది.

ఇటీవలే బాలీవుడ్ లో ‘ఇందూ సర్కార్’ అంటూ ఒక సానిమా వచ్చింది. మధుర్ బండార్కర్ రూపొందించిన ఆ సినిమా ఇందిరపై విమర్శనాస్త్రమనే పేరే వచ్చింది. అయితే ఆ సినిమా విడుదలకు ముందు వివాదం రేపినా.. విడుదల తర్వాత మాత్రం ఎవ్వరినీ ఆకట్టుకోలేదు. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో దివంగత ప్రధాని పై సినిమా వస్తే మాత్రం అది ఆసక్తిని రేపడం ఖాయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.