యాప్నగరం

నయన్‌ బర్త్ డే.. ప్రియుడి దర్శకత్వ ప్రతిభ

గత మూడేళ్లుగా సక్సెస్‌ఫుల్ లవ్ జర్నీ కొనసాగిస్తున్న ఈ ప్రేమ జంట బర్త్ డే వెకేషన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. నేడు తన అందాల ప్రేయసి బర్త్ డే కావడంతో తన దర్శకత్వ ప్రతిభకు పదును పెట్టి ‘సూపర్ లేడీ స్టార్’ పేరుతో ప్రత్యేకంగా బర్త్ డే కేక్‌ను తయారు చేయించాడు.

Samayam Telugu 18 Nov 2018, 8:42 pm
నేటితో 34వ ఏటలోకి అడుగుపెట్టిన దక్షణాది స్టార్ హీరోయిన్‌ నయన తారకి అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్. గత మూడేళ్లుగా సక్సెస్‌ఫుల్ లవ్ జర్నీ కొనసాగిస్తున్న ఈ ప్రేమ జంట బర్త్ డే వెకేషన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. నేడు తన అందాల ప్రేయసి బర్త్ డే కావడంతో తన దర్శకత్వ ప్రతిభకు పదును పెట్టి ‘సూపర్ లేడీ స్టార్’ పేరుతో ప్రత్యేకంగా బర్త్ డే కేక్‌ను తయారు చేయించాడు.
Samayam Telugu నయన్ తార

View this post on Instagram A Tiny little surprise for my thangam’s #birthday 💥💥😇😇😇 #happybirthdaynayanthara #hbdladysuperstarnayanthara #HBDNayan #Love #surprisebirthday A post shared by Vignesh Shivn (@wikkiofficial) on Nov 18, 2018 at 12:21am PST
ఇందులో ఫిల్మ్ థీమ్‌తో కేక్‌పై నయన్ ఫోటో ఉంచి.. క్లాప్ బోర్డ్‌పై ‘హ్యాపీ బర్త్ డే నయనతార అనే అక్షరాలతో పాటు పుట్టిన తేదీని కూడా ఉంచారు. మరోవైపు కెమెరా, నాలుగు స్టార్లు ఉంచి బ్యాగ్రౌైండ్‌లో విద్యుత్ దీపాల అలంకరణతో ఫోటోకి సూపర్బ్ లుక్ ఇచ్చాడు. తన ప్రేయసి కోసం విఘ్నేష్ శివన్ చూపించిన దర్శకత్వ ప్రతిభకు నయన్‌తో అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శింబు, ప్రభుదేవాలతో బ్రేకప్ తరువాత నయన్.. తమిళ స్టార్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తుంది. 2015లో వచ్చిన ‘నానుమ్ రౌడీ ధాన్’ చిత్రంతో వీరిద్దరి మధ్య ప్రేమకు బీజం పడింది. గత మూడేళ్లుగా ఈ లవ్ జర్నీని కొనసాగిస్తూ.. రిలేషన్‌షిప్స్ విషయంలో దాపరికాలు లేకుండా వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తోంది ఈ ప్రేమజంట. త్వరలో పెళ్లి పీటలు ఎక్కుబోతున్నారంటూ గత మూడేళ్లుగా వార్తలు వస్తున్నా.. ఇప్పటి వరకూ హాలిడే వెకేషన్స్, పార్టీలు, షికార్లు వరకే పరిమితం అయ్యారు. చూడాలి వచ్చే ఏడాదైనా పెళ్లి పీటలు ఎక్కుతారేమో.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.