యాప్నగరం

Meeku Matrame Chepta: ‘మీకు మాత్రమే చెప్తా’ అంటున్న విజయ్ దేవరకొండ

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నిర్మాతగా మారారు. ఆయన నిర్మిస్తున్న తొలి చిత్రానికి మీకు మాత్రమే చెప్తా అనే ఫన్నీ టైటిల్‌ను పెట్టారు. ఈ విషయాన్ని ఆయన తనదైన శైలిలో ప్రకటించారిలా..

Samayam Telugu 29 Aug 2019, 2:42 pm
అర్జున్‌రెడ్డి సినిమాతో విజయ్ దశ తిరిగింది. వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పుడు నిర్మాతగానూ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తొలి సినిమాకు మీకు మాత్రమే చెప్తా అనే ఆసక్తికర టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయన్ని కూడా ఆయన ఆసక్తికరమైన వీడియె ద్వారా ప్రకటించారు.
Samayam Telugu v


‘సినిమా పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకోవడానికి చాలా మంది కష్టపడుతుంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన రోజే నిర్ణయించుకున్నాను నిర్మాణ సంస్థను ప్రారంభించాలని. అది ఎంత కష్టమో, ఎంత రిస్కో తెలిసొచ్చింది. నేను డబ్బులన్నీ సేవ్ చేసుకుని కింగ్ ఆఫ్ ది హిల్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించాను’ అని పేర్కొంటూ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

మరో విషయం ఏంటంటే.. తనకు ‘పెళ్లి చూపులు’ సినిమాలో అవకాశం ఇచ్చిన తరుణ్ భాస్కర్‌నే తన సినిమాలో లీడ్ రోల్‌గా పెట్టుకున్నారు. ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ప్రస్తుతం ‘హీరో’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆనంద్ అన్నమలై దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తున్నారు. దీంతో పాటు ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.