యాప్నగరం

6లక్షల హీరో కోటిన్నర పలుకుతున్నాడు

ఒక్క హిట్ ఒకే ఒక హిట్ విజయ్ దేవరకొండను కోటీశ్వరుడ్ని చేసేసింది. పెళ్లిచూపులు సినిమాతో తనలోని స్టార్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని అద్భుత నటనతో ఆకట్టుకుని వరుస అవకాశాలతో మంచి జోరుమీద ఉన్న విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ విషయంలోనూ ఇదే జోరును కొనసాగిస్తున్నాడు.

TNN 22 Nov 2016, 4:24 pm
క్క హిట్ ఒకే ఒక హిట్ విజయ్ దేవరకొండను కోటీశ్వరుడ్ని చేసేసింది. పెళ్లిచూపులు సినిమాతో తనలోని స్టార్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని అద్భుత నటనతో ఆకట్టుకుని వరుస అవకాశాలతో మంచి జోరుమీద ఉన్న విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ విషయంలోనూ ఇదే జోరును కొనసాగిస్తున్నాడు.
Samayam Telugu vijay devarakonda remunerationpelli choopulu hero hike his remuneration
6లక్షల హీరో కోటిన్నర పలుకుతున్నాడు


వడే సుబ్రహ్మణ్యం’సినిమాలో నానితో పోటీపడి నటించి పెళ్లిచూపులు సినిమాలో అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఆ సినిమాలో విజయ్ అంటే ఎవరో తెలయని వారుకూడా అతనిలోని నటనకు వంద మార్కులు వేయడంతో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే సినిమా అతి తక్కువ బడ్జెట్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ హిట్ కొట్టడంతో పాటు 50 రోజులు సక్సెస్‌ఫుల్‌గా ఆడింది.

పెళ్లిచూపులు హిట్ కిక్కు మనోడి స్థాయిని రెట్టింపుచేయడంతో పాటు రెమ్యునరేషన్ అమాంతం పెరిగిపోయింది. పెళ్లిచూపులు సినిమాకి కేవలం 6 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్న ఈ యంగ్ హీరో తరువాత ‘ద్వారకా’ సినిమాకి 20 లక్షలు తీసుకునన్నాడు. తాజాగా యు.వి క్రియేషన్స్‌లో తాను చేయబోయే సినిమాకి 80 లక్షలకు సైన్ చేశాడట. అంతే కాదు కొత్త ప్రాజెక్ట్స్‌లో నటించడానికి కోటిన్నర డిమాండ్ చేస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తుంది.

పారితోషికం నేను ఇంత కావాలని అడగడం లేదు, హిట్ వస్తే ఏ హీరోకైనా మార్కెట్ రేటు పెరుగుతుంది. వాళ్లు ఇస్తున్నారు నేను తీసుకుంటున్నా అని ఈ పాత పెళ్లికొడుకు కొత్త మార్కెట్ లెక్కలను చెప్పేస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.