యాప్నగరం

ఇది దానం కాదు సాయం .. మిడిల్ క్లాస్‌కు అండగా విజయ్ దేవరకొండ

విజయ్ దేవర కొండ సాయం చేయడంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. రెండు ట్రస్టీలను ఏర్పాటు చేశాడు. ఒకటి నిరుద్యోగుల కోసం. మరొకటి మధ్యతరగతి ప్రజల కోసం.

Samayam Telugu 26 Apr 2020, 12:49 pm
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడానికి విరాళం ప్రకటించాడు. రూ. కోటి 30 లక్షల సాయం చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అంతేకాదు కరోనా సమయంలో సాయం చేసేందుకు రెండు ఛారిటీలను కూడా ఏర్పాటు చేశాడు. కరోన విషయంలో తనదైన స్టైల్లో సాయం అందిస్తూ... తనకుంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నాడు. ‘ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్’(టిడి‌ఎఫ్), మిడిల్ క్లాస్ ఫండ్ (ఎంసీ‌ఎఫ్) అనే రెండు ఛారిటీ విభాగాలను విజయ్ దేవరకొండ ప్రారంభించాడు.
Samayam Telugu విజయ్ దేవరకొండ


కోటి రూయాలతో మొదలైన టిడిఎఫ్ ఫౌండేషన్ తరపున కొందరు విద్యార్థులను ఎంపిక చేసి వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దుతానని ఈ ‘గీత గోవిందం’ చెబుతున్నారు. అంతేకాదు తన జీవితంలో కనీసం ఒక లక్ష మందికి ఉద్యోగాలను తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడట. ఇక వాటితో పాటు.. సంక్షోభ సమయంలో డబ్బుల్లేక నిత్యావసరాలు కూడా ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి ప్రజల కోసం కూడా విజయ్ ముందుకు వచ్చాడు. వారి కోసం మిడిల్ క్లాస్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. రూ. 25లక్షలతో దీనిని ప్రారంభించాడు.

ఈ ఫౌండేషన్ ముఖ్య ద్యేయం కనీస అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్నవారికి కనీస అవసరాలు అందేలా చూడటం. ఒకప్పుడు తనది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయేనని గుర్తు చేశాడు విజయ్ దేవరకొండ. అందుకే మధ్యతరగతి కష్టాలు తనకు తెలుసన్నాడు. ఎవరికైనా నిత్యావసరాలు అవసరం అయితే thedeverakondafoundation.org వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ డిటైల్స్ నమోదు చేసుకుంటే ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వారికీ నిత్యావసర సరుకులు అందిస్తారట. దాదాపు 2000 కుటుంబాల అవసరాలని ఎం.సి.ఎఫ్ ట్రస్ట్ తీర్చే ఉద్ధేశంగా పెట్టుకున్నట్టు విజయ్ తెలిపాడు. అయితే ఇది దానం ఏ మాత్రం కాదని సాయం అని అర్జున్ రెడ్డి హీరో చెబుతున్నాడు. ఈ ఫౌండేషన్ ద్వారా సాయం పొందినవారు ఎప్పుడైనా తిరిగి ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చని కూడా చెబుతున్నారు. అలా వచ్చిన డబ్బుల్ని వేరే మంచి కార్యక్రమాల కోసం వాడుతామని విజయ్ తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.