యాప్నగరం

తిత్లీ బాధితులకు ‘అర్జున్‌రెడ్డి’ భారీ సాయం

ఇతర రాష్ట్రాలలో ఏదైనా విపత్తు జరిగితే మేము సైతం అంటూ పోటీపడి మరీ విరాళాలిచ్చే సెలబ్రిటీలు స్పందించకపోవడంతో ఉత్తరాంధ్ర ప్రజలు డీలా పడిపోతున్నారు.

Samayam Telugu 14 Oct 2018, 11:53 pm
తిత్లీ తుఫాన్ వల్ల శ్రీకాకుళం జిల్లాలో వందల గ్రామాలు అతలాకుతలమయ్యాయి. భారీ ఆస్తి నష్టం సంభవించడంతో సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరారు. మరోవైపు ఇతర రాష్ట్రాలలో ఏదైనా విపత్తు జరిగితే మేము సైతం అంటూ పోటీపడి మరీ విరాళాలిచ్చే సెలబ్రిటీలు స్పందించకపోవడంతో ఉత్తరాంధ్ర ప్రజలు డీలా పడిపోతున్నారు. ఈ క్రమంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తన వంతు సాయం ప్రకటించిన తొలి ఆర్టిస్ట్, కాగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవరకొండ తనవంతు సాయాన్ని అందజేసిన మరో ఆర్టిస్టు.
Samayam Telugu Titli Cyclone


తన వంతుగా సిక్కోలుకు రూ. 5లక్షలు ఆర్థిక సాయం చేశారు. సీఎం రిలీప్ ఫండ్‌కు డబ్బులు పంపినట్లు స్క్రీన్ షాట్‌ను కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు విజయ్. ‘లేహ్‌లో ఉన్న నాకు ఇప్పుడే తిత్లీ తుఫాన్ విషయం తెలిసింది. ప్రస్తుతం మన సొంత ప్రాంతంలో సమస్య వచ్చింది. పెద్ద మనసుతో ఎంత ఇచ్చినా పెద్ద సాయం అవుతుంది. గతంలో కేరళకు సాయం చేశారు. ఇప్పుడు మనవాళ్లకు సాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందని’ విజయ్ పోస్ట్ చేశారు.
రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకునే పనులు చేస్తూనే ఉన్నారు నటుడు విజయ్. తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్‌ అవార్డును వేలం వేసి, వచ్చిన 25లక్షలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చి గొప్ప మనసు చాటుకున్న విజయ్.. ఆపై కేరళ వరద బాధితులకు తన వంతుగా రూ. 5లక్షలు సాయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా తిత్లీ తుఫాన్ విషయం తెలిసిన వెంటనే ‘అర్జున్‌రెడ్డి’ 5లక్షలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించి రియల్ హీరో అని నిరూపించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.