యాప్నగరం

Vijay Deverakonda: పరీక్ష పేపర్‌లో విజయ్ దేవరకొండ పేరు!

విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు. చివరికి పరీక్ష పేపర్లో సైతం ‘అర్జున్ రెడ్డి’ హవా!

Samayam Telugu 22 Nov 2018, 11:10 pm
టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ క్రేజ్ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ సినిమాలతో మాంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్న విజయ్ పేరు ఇప్పుడు పరీక్ష పేపర్‌లోనూ ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక విజయ్ అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు.
Samayam Telugu Untitled12221


ఇంటర్నెట్‌లో వైరల్‌గా షేరవ్వుతున్న ఈ పరీక్ష పేపరు.. ఓ ఇంగ్లీష్ పరీక్షకు సంబంధించినదిగా తెలుస్తోంది. అయితే, ఇది ఏ అర్హత పరీక్షకు సంబంధించందనే వివరాలు తెలియరాలేదు. ఇందులోని 8వ ప్రశ్నలో Vijay Devarakonda has been________ since his blockbuster movie 'Arjun Reddy'. అని ఇచ్చి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. అంటే ‘అర్జున్ రెడ్డి’ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత మంచి క్రేజ్ సంపాదించాడు అనే విషయాన్ని ఇంగ్లీషులో ఏ విధంగా చెబుతారనేది ఆ ఖాళీలో పూరించాలి.

సినీతారల పేర్లు పరీక్ష పేపర్లలో ప్రత్యక్షం కావడం కొత్తేమీ కాదు. గతంలో ‘అల్ఫాబెట్ సూపర్ ఫర్ లవర్స్’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారనే ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో రచయితల పేర్లతో పాటు సన్నీలియోన్ పేరు కూడా పెట్టారు. అప్పట్లో అది వివాదాస్పదమైంది కూడా. పోర్న్ స్టార్ పేరును పరీక్ష పత్రాల్లో పెట్టడం ఏమిటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో జరిగిన ఓ పరీక్షలో.. ‘క్రికెటర్ విరాట్ కొహ్లీ గర్ల్ ఫ్రెండ్’ ఎవరు అనే ప్రశ్న కూడా విమర్శలకు దారితీసింది. అయితే, విజయ్ దేవరకొండకు సంబంధించిన ప్రశ్న.. ఇంగ్లీష్ గ్రామర్‌కు సంబంధించినది కావడంతో వివాదాస్పదం కాకున్నా.. ‘రౌడీ’ అభిమానుల్లో మాత్రం ఆనందం నింపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.