యాప్నగరం

Samantha: యూ నాటీ అంటూ సమంతపై విజయ్ దేవరకొండ కామెంట్.. విదేశాల్లో రౌడీ స్టార్ హగ్! సీక్రెట్స్ రివీల్..

సమంత ఫుల్ టైమ్ హోస్ట్‌గా రాబోతున్న 'సామ్ జామ్' ప్రోగ్రాం తొలి ఎపిసోడ్ ప్రోమోలో విజయ్ దేవరకొండ తెగ హంగామా చేస్తూ కనిపించారు. తన క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తూ క్లియర్ హిట్స్ ఇచ్చారు.

Samayam Telugu 13 Nov 2020, 5:16 pm
నాతో ఎంజాయ్‌మెంట్ మాములుగా ఉండదంటూ స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. తొలిసారి బిగ్ బాస్ తెరపై హోస్ట్‌గా దర్శనమిచ్చి సత్తాచాటిన ఈ అక్కినేని కోడలు.. అల్లు అరవింద్ 'ఆహా' కోసం ఫుల్ టైమ్ హోస్ట్‌గా మారిపోయింది. 'సామ్ జామ్' ప్రోగ్రాం ద్వారా సెలబ్రిటీలతో ఆటలాడుతూనే సరదాగా వారి వారి వ్యక్తిగత విషయాలు రాబట్టేందుకు రెడీ అయింది. తాజాగా ఈ ప్రోగ్రాం ప్రోమో రిలీజ్ కాగా అందులో సమంత, విజయ్ దేవరకొండ చేసిన హంగామా ఆకట్టుకుంది.
Samayam Telugu యూ నాటీ అంటూ సమంతపై విజయ్ దేవరకొండ కామెంట్..
Vijay deverakonda Samantha


నవంబర్ 13 నుంచి ఆహా ఓటీటీ వేదికపై 'సామ్ జామ్' ప్రోగ్రాం స్ట్రీమింగ్ కానుంది. తొలి ఎపిసోడ్ కోసం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను ఎంపిక చేసుకొని ఈ షో ప్రోమో వీడియో రిలీజ్ చేశారు. ఇందులో సమంత, విజయ్ దేవరకొండ గెటప్స్ స్పెషల్ అట్రాక్షన్ కాగా.. సమంత హోస్ట్ చేస్తుంటే విజయ్ సూటిపోటి మాటలు హైలైట్ అయ్యాయి. ఎంతో హుషారుగా డాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ వేదికపైకి వచ్చిన సమంత.. అదే జోష్‌లో రౌడీ స్టార్‌ని ఆహ్వానించి మజా చేసింది.

Also Read: Nayanthara: రొమాంటిక్ మూడ్‌లో నయనతార.. ప్రియుడితో ఇంట్లో ఏకాంతంగా!

పనిలో పనిగా విజయ్ దేవరకొండ సీక్రెట్స్ రాబట్టే ప్రయత్నం చేసిన సమంత.. యూరోప్ వెళ్లారు కదా అక్కడ ఎవరినీ హగ్ చేసుకోలేదా? అని ప్రశ్నించింది. దీనిపై రియాక్ట్ అయిన రౌడీ స్టార్ ఆమెను 'సచ్ ఎ నాటీ' అనేశారు. ఇక రెబల్, సింగిల్ అని రాసి ఉన్న గ్లాస్ బోర్డ్స్ పగలగొట్టేస్తూ తన క్యారెక్టర్, ప్రెజెంట్ స్టేటస్ చెప్పకనే చెప్పేశారు విజయ్ దేవరకొండ. దీంతో ప్రోమోనే ఇంతలా ఆకట్టుకుంటే పూర్తి ఎపిసోడ్ ఇంకెంత మజా ఇస్తుందో అని ఆసక్తిగా ఉన్నారు ఆడియన్స్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.