యాప్నగరం

సూర్యకు విజయ్ దేవరకొండ ట్వీట్: క్రమశిక్షణ నేర్చుకోవాలి

‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న విజయ్ దేవరకొండ.. సూర్య, కార్తీలను పొగడ్తలతో ముంచెత్తారు.

Samayam Telugu 12 Jul 2018, 7:37 pm
‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న విజయ్ దేవరకొండ.. సూర్య, కార్తీలను పొగడ్తలతో ముంచెత్తారు. కార్తీ హీరోగా, ఆయన అన్న సూర్య నిర్మించిన ‘చినబాబు’ చిత్రం స్నీక్ పీక్ వీడియో రిలీజ్ చేసిన విజయ్... ‘‘నేనెంతో ఇష్డపడే సూర్య, కార్తిల చిత్రం స్నీక్‌పీక్ విడుదల చేయడం సంతోషంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు.
Samayam Telugu 123aa


‘‘మా తాత రైతు, నేను 4వ తరగతి చదివే వరకు మా నాన్న కూడా రైతే. ఏదో ఒక రోజు వెనక్కి వెళ్లి వ్యవసాయం చేయాలనేది ఆయన కల’’ విజయ్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. విజయ్ ట్వీట్లకు స్పందించిన సూర్య.. ‘‘నువ్వు ఎంచుకున్న రంగం కోసం నువ్వు పడుతున్న శ్రమ.. నీపై నాకు గౌరవాన్ని పెంచింది. త్వరలోనే కలుద్దాం’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు స్పందించిన విజయ్.. ‘‘తప్పకుండా తలైవా, నీ నుంచి కొంచెం క్రమశిక్షణ నేర్చుకోవాలి’’ అని రిట్వీట్ చేశారు విజయ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.