యాప్నగరం

Hey Minister Promo Song: ‘నోటా’ మరో వివాదం? - హే మినిస్టర్.. చట్టం నీ చుట్టమేగా!

‘హే మినిస్టర్.. చట్టం నీ చుట్టమేగా’ అంటూ విడుదలైన ఈ సాంగ్ ప్రోమో మరో కొత్త వివాదానికి తెరతీస్తుందా?

Samayam Telugu 4 Oct 2018, 3:37 pm
‘నోటా’ సినిమా విడుదల ఆపాలంటూ ఇప్పటికే వివాదాలు చుట్టుముట్టిన ఈ సినిమాలో తాజాగా విడుదలైన ‘హే మినిస్టర్.. చట్టం నీ చుట్టమేగా’ ప్రోమో సాంగ్ మరో వివాదానికి తెరతీసేలా ఉంది. శుక్రవారం విడుదలకు సిద్ధమవుతున్న ‘నోటా’పై ఇప్పటికే పలు అభ్యంతరాలు వెల్లడయ్యాయి. దీనిపై ఎన్నికల కమిషన్, హైకోర్టుకు ఫిర్యాదులు అందాయి.
Samayam Telugu Untitledaf112


శుక్రవారం (అక్టోబరు 5న) రిలీజ్ సందర్భంగా చిత్రయూనిట్ మరో సాంగ్ ప్రోమో విడుదల చేసింది. ‘‘హే మినిస్టర్ థర్మకోల్‌తో కోట కడదాం.. రా మినిస్టర్, రారా... హే మినిస్టర్ చట్టం నీకు చుట్టమేగ.. రా మినిస్టర్’’ అంటూ ఈ పాట మొదలైంది. లెఫ్ట్‌లో వైను, రైట్‌లో సైను.. వైనా, సైనా.. రారా’’ అంటూ సాగింది. మరి, ఈ పాటపై కూడా అభ్యంతరాలు వెల్లడవుతాయో లేదో అనేది ఈ సినిమా విడుదలయ్యే వరకు చెప్పలేం. విజయ్ దేవరకొండ, మెహరీన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మాత.
నోటా: హే మినిస్టర్ సాంగ్ ప్రోమో

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.