యాప్నగరం

1 షాట్.. 2 షాట్స్.. 'హ్యాప్పీ న్యూ ఇయర్' సాంగ్

ప్రేమమ్ సినిమాతో మడోనా సెబాస్టియన్ తెలుగు ప్రేక్షకుల మనసును తాకింది. మడోనా తాజా సినిమాలోని 'హ్యాప్పీ హ్యాప్పీ న్యూ ఇయర్' అంటూ సాగే పాట రీకార్డింగ్ వీడియో...

TNN 30 Dec 2016, 2:32 pm
ప్రేమమ్ సినిమాతో మడోనా సెబాస్టియన్ తెలుగు ప్రేక్షకుల మనసును తాకింది. అలాగే పిజ్జా, పిజ్జా2 సినిమాలతో హీరో విజయ్ సేతుపతి కూడా పరిచయమే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో తమిళంలో రూపొందుతున్న చిత్రం 'కవన్'. కే.వీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఇటీవలే హీరో ధనుష్ విడుదల చేశాడు. ఈ టీజర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది.
Samayam Telugu vijay sethupathi kavan film happy new year song
1 షాట్.. 2 షాట్స్.. 'హ్యాప్పీ న్యూ ఇయర్' సాంగ్




న్యూయర్ రాబోతుండటంతో ఈ సినిమాలోని 'హ్యాప్పీ హ్యాప్పీ న్యూ ఇయర్' అంటూ సాగే పాట రీకార్డింగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు. పాట పూర్తిగా తమిళంలో ఉన్నప్పటికీ ఫుల్ జోష్‌గా ఉంది. 'ధృవ' సినిమాకి సంగీతం అందించిన హిప్ హాప్ తమీజా ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందించారు. ఇందులోని నటులందరికీ తెలుగులో ప్రేక్షకాదరణ ఉన్నందున ఈ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.