యాప్నగరం

చిరంజీవితో అనుకున్న సన్నివేశం రామ్‌చరణ్‌తో..!

‘మగధీర’లోని వంద మందిని చంపే ఎపిసోడ్‌ను ముందు చిరంజీవికి వినిపించామని, అనుకోని కారణాల ఆయన సినిమా చేయలేకపోయామని రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ అన్నారు.

TNN 11 Sep 2017, 6:30 pm
‘మగధీర’లోని వంద మందిని చంపే ఎపిసోడ్‌ను ముందు చిరంజీవికి వినిపించామని, అనుకోని కారణాల ఆయన సినిమా చేయలేకపోయామని రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ అన్నారు. చిరంజీవికి వినిపించిన ఆ సన్నివేశాన్ని ‘మగధీర’లో వాడుకున్నామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో ‘శ్రీవల్లి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగా పవర్‌స్టార్ ముఖ్య అతిగా విచ్చేసి మాట్లాడారు. సినిమాలో విజయేంద్రప్రసాద్ పేరుంటే అది జాతీయ సినిమా అయిపోయినట్టేనని, అంతకుమించి ఎలాంటి ప్రచారం అక్కర్లేదని చరణ్ కొనియాడారు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.
Samayam Telugu vijayendra prasad speech in srivalli pre release event
చిరంజీవితో అనుకున్న సన్నివేశం రామ్‌చరణ్‌తో..!


‘‘సింహాద్రి’ తర్వాత చిరంజీవితో ఎప్పుడు సినిమా చేస్తున్నారు అని రాజమౌళిని ఎవరో అడిగారు. దానికి చిరంజీవితో నేను సినిమా చేయడమేంటి. ఆయనే వరం ఇవ్వాలి. ఆ అదృష్టం నాకు ఎప్పుడు వస్తుందో అని రాజమౌళి చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చిరంజీవి నుంచి మాకు పిలుపువచ్చింది. నాకో సినిమా చేసిపెట్టమని పెద్ద మనసుతో ఆయన అడిగారు. చిరంజీవి అలా అడగ్గానే మాలో కొండంత ఉత్సాహం వచ్చింది. వారం రోజుల తర్వాత ‘మగధీర’లో వందమందిని చంపే ఎపిసోడ్‌ను ఆయనకు వినిపించాం. ఆ లైన్ వినగానే ఆయన రోమాలు నిక్కబొడిచాయి. వెంటనే సినిమా చేద్దామని చెప్పారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆయనతో సినిమా చేయలేకపోయాం. చివరకు ఆ సన్నివేశాన్ని మగధీరలో రామ్‌చరణ్‌తో తీశాం’ అని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.

‘మగధీర2’ సినిమాను ఇప్పుడు చిరంజీవితో తీస్తారా..? రామ్‌చరణ్‌తో తీస్తారా..? అని విజయేంద్రప్రసాద్‌ను పరచూసి గోపాలకృష్ణ ప్రశ్నించారు. పరుచూరి బ్రదర్స్ కలం, బలం తోడైతే చిరంజీవి, రామ్‌చరణ్‌ల కలయికలో ‘మగధీర2’ చేస్తాను అని విజయేంద్ర ప్రసాద్ సమాధానం ఇచ్చారు. వినూత్నమైన కథాంశంతో శ్రీవల్లి చేశానని, ఇప్పటివరకూ తెరపై ఇలాంటి కథ రాలేదని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.