యాప్నగరం

అబ్బే, ఆ సినిమా వసూళ్ల లెక్కలు ఫేక్!

ఒకవైపు ఇప్పటికే ‘మెర్సల్’ సినిమా బోలెడంత వివాదాన్ని అంటించుకుని వార్తల్లో నిలుస్తోంది

TNN 30 Oct 2017, 1:29 pm
ఒకవైపు ఇప్పటికే ‘మెర్సల్’ సినిమా బోలెడంత వివాదాన్ని అంటించుకుని వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాలో కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడంపై భారతీయ జనతా పార్టీ నేతలు గరం అయ్యారు. అయితే తమిళ ప్రముఖులంతా ఈ సినిమాకు అండగా నిలబడ్డారు. ఈ సినిమాపై కమలం పార్టీ సానుభూతి పరులు కోర్టుకు కూడా వెళ్లారు. ఈ సినిమాను మళ్లీ సెన్సార్ చేయించాలని కోరారు. అయితే అందుకు న్యాయస్థానం నిరాకరించింది. మరి ఆ వివాదం అలా ఉండగానే.. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక తమిళ డిస్ట్రిబ్యూటర్ ఒకరు ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశాడు.
Samayam Telugu vijays mersal box office numbers are fake distributor
అబ్బే, ఆ సినిమా వసూళ్ల లెక్కలు ఫేక్!


‘మెర్సల్’ సినిమా వసూళ్లపై ఆయన మాట్లాడుతూ ‘అబ్బే.. అవన్నీ ఉత్తుత్తి లెక్కలు..’ అని కుండబద్ధలు కొట్టడం విశేషం. స్వయంగా చెన్నైలో ఒక థియేటర్ నుకూడా కలిగిన డిస్ట్రిబ్యూటర్ అభిరామి రామనాథన్ మెర్సల్ భారీ వసూళ్ల లెక్కలపై స్పందించాడు. ఆ సినిమా రెండు వందల కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది, ఈ తరహా రికార్డు విషయంలో ‘రోబో’ తర్వాత ‘మెర్సల్’ ప్రత్యేకతను సంతరించుకుంటోందని జరుగుతున్న ప్రచారాన్ని ఈ పంపిణీదారుడు తప్పు పట్టాడు. కేవలం ఈ సినిమావైపు జనాలను ఆకర్షించడానికే ఇలాంటి నంబర్లు చెబుతున్నారని.. ఆ లెక్కలన్నీ నిజం కాదని రామనాథన్ వ్యాఖ్యానించారు.

‘మేం థియేటర్ల ఓనర్లం. అదే పనిగా బ్లాకులో టికెట్లను అమ్మమని కొంతమంది కుర్రాళ్లను నియమిస్తాం. టికెట్లకు డిమాండ్ ఉండటం వల్ల ఆ పని చేయించం, బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారంటే.. కలెక్షన్లు బాగున్నాయి, సినిమా బాగుంటుందని ప్రేక్షకులు అనుకోవడానికే ఆ పని చేయిస్తాం. కలెక్షన్ల లెక్కలు కూడా ఇదే తరహా వ్యూహమే. రెండొందల కోట్లు వసూళు చేసింది అంటే.. సదరు సినిమాను చూడటానికి జనాలు ఎగబడతారు.. అనే వ్యూహంతోనే అలాంటి ఫేక్ వసూళ్ల లెక్కలు చెబుతూ ఉంటారు. మెర్సల్ కూడా అదే తరహా సినిమానే..’ అని ఈ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అన్నారు. ఒకవైపు మెర్సల్ సూపర్ హిట్ అని ఆ సినిమా యూనిట్ చెబుతుంటే.. ఈ డిస్ట్రిబ్యూటర్ ఇలా మాట్లాడటం ఆసక్తిదాయకంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.