యాప్నగరం

విక్రమ్, సమంత ‘10’ సినిమా డిసెంబర్ 15న రిలీజ్!

తమిళంలో విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘10’ సినిమా అక్కడ మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. తెరపై విక్రమ్, సమంత జోడీని చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతారని చిత్ర బృందం భావిస్తోంది.

TNN 12 Dec 2017, 10:18 pm
ఆదరణ పెరుగుతుండటంతో దక్షణాది అగ్ర హీరోల సినిమాలను ఒకటి కంటే ఎక్కువ భాషల్లో విడుదల చేయడం ఇటీవల ఎక్కువైంది. కొంత మంది నిర్మాతలైతే.. గతంలో విడుదలైన సినిమాలను కూడా ఆయా భాషల్లోకి అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇదే కోవలో రెండేళ్ల కిందట తమిళంలో విడుదలైన ఓ సినిమాను ఇప్పుడు తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘10 ఎండ్రాదుకుల్లా’ అనే ఈ సినిమాలో విలక్షణ నటుడు విక్రమ్, సమంత ప్రధాన పాత్రలు పోషించడం విశేషం. వీరిద్దరికీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమాను ‘10’ పేరుతో ఈ శుక్రవారం (డిసెంబర్ 15) తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.
Samayam Telugu vikram samantha starrer 10 telugu movie to release on dec 15
విక్రమ్, సమంత ‘10’ సినిమా డిసెంబర్ 15న రిలీజ్!


తమిళంలో విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. దీన్ని ‘10’ పేరుతో శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై జి.సుబ్రమణ్యం-ఎం.సుబ్బారెడ్డి-రామారావు చింతపల్లి సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

తెరపై విక్రమ్, సమంత జోడీని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారని చిత్ర బృందం భావిస్తోంది. శాటిలైట్ బిజినెస్ కూడా కలిసొస్తుందని ఆశిస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు ఈ సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడం గమనార్హం. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.