యాప్నగరం

'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్‌లో విక్రమ్ తనయుడు

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా త్వరలోనే తమిళంలో రీమేక్ కాబోతోంది. ఇందులో హీరో ఎవరో కాదు..

TNN 2 Oct 2017, 4:48 pm
టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా త్వరలోనే తమిళంలో రీమేక్ కాబోతోంది. ఇందులో హీరో ఎవరో కాదు.. హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ విక్రమ్. అవును, విక్రమ్ తనయుడు ఈ సినిమాతో హీరోగా సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు. తెలుగులో విక్రమ్ దేవరకొండ నటించిన పాత్రను తమిళంలో ధృవ విక్రమ్ పోషించనున్నాడు. విక్రమ్ స్వయంగా తానే ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకి వెల్లడించాడు.
Samayam Telugu vikrams son dhruv in arjun reddys tamil remake
'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్‌లో విక్రమ్ తనయుడు

@dhruv.vikram .. ready to make the leap. #DhruvtobeArjunReddy #E4Entertainment A post shared by Vikram (@the_real_chiyaan) on Oct 1, 2017 at 5:32am PDT
మరోవైపు అర్జున్ రెడ్డి తమిళ రీమేక్‌ని నిర్మించనున్న ముఖేష్ మెహతా సైతం ఫేస్‌బుక్ ద్వారా ఈ రీమేక్‌ని కన్ఫర్మ్ చేశాడు. విక్రమ్ తనపై ఎంతో నమ్మకం వుంచి ధృవ విక్రమ్‌ని లాంచ్ చేసే అవకాశం ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా వుందని ముఖేష్ మెహతా తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.