యాప్నగరం

విశాల్‌పై వేటు వేసిన నిర్మాతల మండలి

నటుడు, నిర్మాత, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్‌ని నిర్మాతల మండలి నుంచి తొలగిస్తున్నట్టు ...

TNN 15 Nov 2016, 12:01 am
నటుడు, నిర్మాత, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్‌ని నిర్మాతల మండలి నుంచి తొలగిస్తున్నట్టు తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పష్టంచేసింది. గత ఆగస్టులో తమ సంస్థ గురించి విశాల్ చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపై అతడి నుంచి వివరణ తీసుకున్న నిర్మాతల మండలి... అతడి వివరణ పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. విశాల్ వ్యవహారశైలి నిర్మాతల మండలి ఐక్యతని దెబ్బతీసేలా ఉన్నాయని ఈ సందర్భంగా మండలి అభిప్రాయపడింది.
Samayam Telugu vishal is suspended from tamil film producers council
విశాల్‌పై వేటు వేసిన నిర్మాతల మండలి


పైరసీ వంటి వాటిని అరికట్టడం కన్నా కట్ట పంచాయతీలు పెట్టి పారితోషికం సమస్యల్ని పరిష్కరించడానికే నిర్మాతల మండలి అధిక ప్రాధాన్యత ఇస్తోంది అని ఆగస్టులో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ చేసిన వ్యాఖ్యలు నిర్మాతల మండలికి ఆగ్రహం తెప్పించాయి. అంతేకాకుండా వచ్చేసారి నిర్మాతల మండలి ఎన్నికల్లో సైతం తాను పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా అదే ఇంటర్వ్యూలో స్పష్టంచేశాడు విశాల్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.