యాప్నగరం

మగాళ్లను కూడా పడక గదికి రమ్మంటున్నారు: బాలీవుడ్ డైరెక్టర్

ఇండస్ట్రీలో మగవాళ్లపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ సంచలన ట్వీట్ చేసిన బాలీవుడ్ దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి (హేట్ స్టోరీ ఫేమ్) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల బారినపడే వారిలో ఆడా, మగ అనే తేడా లేదనీ, మీ టూ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు మగవాళ్లకు కూడా వర్తిస్తుందని అన్నారు.

TNN 13 Mar 2018, 4:51 pm
ఇండస్ట్రీలో మగవాళ్లపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ సంచలన ట్వీట్ చేసిన బాలీవుడ్ దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి (హేట్ స్టోరీ ఫేమ్) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల బారినపడే వారిలో ఆడా, మగ అనే తేడా లేదనీ, మీ టూ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు మగవాళ్లకు కూడా వర్తిస్తుందని ఆయన అన్నారు. లైంగికంగా వేధించే వారికి వ్యతిరేకంగా పోరాడే ధైర్యం ఎవరికీ లేదని, అందుకు బోలెడంత మంది కంగనా రనౌత్‌లు ధైర్యంగా ముందుకు రావాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
Samayam Telugu vivek agnihotri hot comments on sexual harassment in bollywood
మగాళ్లను కూడా పడక గదికి రమ్మంటున్నారు: బాలీవుడ్ డైరెక్టర్


అమెరికా నుంచి తిరిగొచ్చిన తన బంధువుల అబ్బాయి ఒకర్ని ఇండస్ట్రీకి పరిచయం చేశానని తెలిపిన అగ్నిహోత్రి అతణ్ని ఓ స్టార్ హీరో, దర్శక నిర్మాతలు లైంగికంగా వేధించారని గత వారం ట్వీట్ చేశారు. ఈ అంశంపై మీడియా ఛానెల్‌ ఆయణ్ని సంప్రదించగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ప్రస్తుతం బాలీవుడ్‌లో 3 రకాల రాజకీయాలు కొనసాగుతున్నాయి.. లైంగిక సంబంధ వ్యవహారాలు, డబ్బు, అధికారం.. ఈ మూడింటితో అవకాశాల కోసం వచ్చేవారిని వేధిస్తున్నారు. అవకాశాల కోసం వస్తే.. పడకగదికి రమ్మంటున్నారు. లేదా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారు. అలా కుదరకపోతే ఊడిగం చేయించుకుంటున్నారు’ అని వివేక్ అగ్నిహోత్రి అన్నారు.

ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి అనేక మంది నటీనటులు అలాంటి వారికి లొంగిపోతున్నారని వివేక్ చెప్పుకొచ్చారు. తన బంధువు కూడా అలాంటి వాళ్ల చేతిలో నలిగిపోయిన బాధితుడేనని తెలిపారు. మీ టూ ఉద్యమం కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాకూడదని, మగవాళ్లు కూడా ఇండస్ట్రీలో జరిగే ఆరాచకాలను బయటపెట్టినప్పుడే దానికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.