యాప్నగరం

శ్రీముఖి ‘కుటుంబ కథా చిత్రమ్’ టీజర్‌

నందు, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కుటుంబ కథా చిత్రమ్’. కె.ఎస్‌ వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ గురువారం (నవంబర్ 16) విడుదలైంది. కమల్‌ కామరాజు ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

TNN 16 Nov 2017, 9:10 pm
నందు, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కుటుంబ కథా చిత్రమ్’. కె.ఎస్‌ వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ గురువారం (నవంబర్ 16) విడుదలైంది. కమల్‌ కామరాజు ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టీజర్ గమనిస్తే.. దీన్ని ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. భాస్కరా గ్రూప్‌ ఆఫ్‌ మీడియా పతాకంపై దాసరి భాస్కర్‌ నిర్మిస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. సునీల్‌ కశ్యప్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
Samayam Telugu watch sreemikhis kutumba katha chitram movie teaser
శ్రీముఖి ‘కుటుంబ కథా చిత్రమ్’ టీజర్‌


టీజర్ కంటే కాస్త ముందుగా ‘కుటుంబ కథా చిత్రం’ ఫస్ట్‌లుక్‌‌ను విడుదల చేశారు. ఇందులో నందు, శ్రీముఖి దిగాలుగా కూర్చొని ఉండగా.. వెనకాల కమల్‌ కామరాజు కాస్త భయగొల్పేలా ఉన్నాడు. నటిగా శ్రీముఖికి అత్యంత కీలకం కానున్న ఈ సినిమా.. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.