యాప్నగరం

Swetha Reddy: సెక్సువల్ హరాస్మెంట్ చేస్తే తొక్క తీస్తాం.. కొడకల్లారా!: రెడ్డి సిస్టర్స్ రచ్చ

కాంట్రవర్శీలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆ ఇద్దరు రెడ్డి సిస్టర్స్ జత కలిశారు. అంతే కాదు ఎవరైనా వేధింపులకు గురిచేస్తే తొక్క తీస్తాం అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు.

Samayam Telugu 31 Jul 2019, 8:51 pm
ఆహా.. ఫొటో అదిరింది కదూ!! ఏమన్నా ఉన్నారా ఇద్దరూ. ఒకర్ని మించి మరొకరు.. ఏ రకంగా చూసినా ఇద్దరూ ఇద్దరే. వాళ్లే రెడ్డి సిస్టర్స్. ఒకరు కాంట్రవర్శీ క్వీన్ శ్రీరెడ్డి అయితే.. మరొకరు కేరాఫ్ కాంట్రవర్శీ శ్వేతా రెడ్డి. ఈ ఇద్దరూ కలిసి సింగిల్ ఫ్రేమ్‌లో దర్శనం ఇచ్చారు.
Samayam Telugu sri reddy and swetha reddy


టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంతో వెలుగులోకి వచ్చి ఇండస్ట్రీ రసికరాజుల కంటిపై కునుకు లేకుండా చేసిన శ్రీరెడ్డి.. తరచూ సెక్సువల్ హరాస్మెంట్‌పై తన వాయిస్‌ని వినిపిస్తూనే ఉంది.

ఇక యాంకర్‌గా పలు ఛానల్స్‌లో పనిచేసి యూట్యూబ్ సంచలనంగా మారిన శ్వేతారెడ్డి.. గత ఎన్నికల్లో కేఏ పాల్‌పై సంచలన ఆరోపణలతో సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అనంతరం ఇటీవల బిగ్ బాస్‌ నిర్వాహకులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సంచలనంగా మారింది.

గాయిత్రి గుప్తాతో కలిసి ఢిల్లీ స్థాయిలో బిగ్ బాస్ షోపై నిరసన తెలిపింది. బిగ్ బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఈ షోను నిలిపివేయాలని నిర్వహకులపై కేసులే వేసే వరకూ వెళ్లింది శ్వేతారెడ్డి.

అటు శ్రీరెడ్డి.. ఇటు శ్వేతారెడ్డి మార్గం ఒకటే కావడంతో ఈ ఇద్దరూ జతకలిశారు. ‘లైంగిక వేధింపులకు మేము ఎప్పుడూ మద్దతు ఇవ్వము.. అలా చేస్తే రెడ్డి సిస్టర్స్ తొక్కతీస్తారు కొడుకులది’ అంటూ ఘాటైన పోస్ట్ వదిలారు ఈ రెడ్డి సిస్టర్స్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.