యాప్నగరం

పవన్ ‘బిగ్ బాస్’ చేస్తే గోడ దూకుతా: ధన్‌రాజ్

ఎన్టీఆర్ బదులు పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తే..? ఈ ప్రశ్న రాగానే ధన్‌రాజ్ షాకింగ్ కామెంట్..

TNN 7 Sep 2017, 5:26 pm
తెలుగులో ‘బిగ్ బాస్’ ప్రోగ్రాం బాగానే క్లిక్ అయ్యింది. ఇందులో ఏముంది రా.. అని తిట్టుకుంటూనే జనాలు షోను చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ షోను హోస్ట్ చేస్తున్న విధానం చూసి జనాలంతా ఫిదా అవుతున్నారు. తనదైన స్టయిల్లో తారక్ షోను నడుపుతుండటంతో.. మిగతా రోజులు ఎలాగున్నా వీకెండ్లో మాత్రం జనాలు బిగ్ బాస్ షో చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ షోను తారక్ కంటే మరెవరూ బాగా హోస్ట్ చేయలేరేమో అనేంతలా యంగ్ టైగర్ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ మధ్య యాంకర్ సుమ కూడా జూనియర్‌ను తెగ ప్రశంసించారు. కానీ ఈ షోను ఎన్టీఆర్ కంటే మరో స్టార్ హీరో అయితే బాగా హోస్ట్ చేయగలడట. ఈ మాటలు చెప్పింది బిగ్ బాస్ హౌస్‌లో ఉండొచ్చిన ధన్‌రాజ్.
Samayam Telugu what if pawan kalyan host bigg boss show dhanraj shocking reply
పవన్ ‘బిగ్ బాస్’ చేస్తే గోడ దూకుతా: ధన్‌రాజ్


అవును ఎన్టీఆర్ బదులు పవన్ ఈ షోను నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఓ మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు ధన్‌రాజ్ ఈ విధంగా బదులిచ్చాడు. పవర్ స్టార్ ఈ షోకు మరింత పవర్ తీసుకొస్తారనే అభిప్రాయాన్ని ఈ నటుడు వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా.. ఒకవేళ అదే జరిగితే గోడ దూకైనా సరే 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్లి రెండ్రోజులు ఉండొస్తానని చెప్పాడు. అయినా వచ్చే సీజన్‌ను కూడా ఎన్టీఆర్ చేసే అవకాశాలే ఎక్కువ. పవన్ సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉంటాడు. ఆయనకు ఇలాంటి అంతగా నచ్చవు కూడా. మరి పవన్ ఈ షో చేస్తే బిగ్ బాస్ హౌస్ కాస్తా.. పవర్ హౌస్ అవుతుందేమో.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కత్తి మహేశ్.. ఎన్టీఆర్ పొగుడుతూ, పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ మాట్లాడి వార్తల్లో నిలవగా.. ధన్‌రాజ్‌ మాత్రం పవన్‌పై ప్రశంసలు గుప్పించడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.