బుల్లి తెరపై బెస్ట్ యాంకర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి, రవి కలిసి అలీకి షాకిచ్చారు. ‘అలీతో సరదా’గా షోలో తమ అభిప్రాయాలు పంచుకున్నవారు.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. స్పాంటేనియస్గా సమాధానాలిస్తూ.. వీరిద్దరూ ఓ దశలో అలీకే అర్థం కాకుండా తయారయ్యారు. మీరిద్దరూ డేటింగ్లో ఉన్నారా అని అలీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. అవును ఉన్నాం. ఏడాదిన్నరగా కలిసి పని చేస్తున్నాం. రెండేళ్లుగా ఒకరికి ఒకరం తెలుసు. ఖాళీ సమయాల్లో కలిసి సరదాగా గడుపుతాం. బయటకి వెళ్తుంటాం. ఇందులో తప్పేంటని శ్రీముఖి గడుసుగా బదులిచ్చింది. ఇద్దరి మధ్యా చక్కటి స్నేహం ఉందని క్లారిటీ ఇచ్చింది.
రవి గురించి ఓ పదం చెప్పమని అడిగితే.. పిచ్చి అని బదులిచ్చింది. అవును రవికి పిచ్చి అంటూ తెలివిగా తప్పించుకుంది. తనలా అల్లరి చిల్లరిగా ఉండే అబ్బాయిలంటే తనకు ఎంతో అభిమానం అని శ్రీముఖి తాపీగా సమాధానం చెప్పింది. నిజామాబాద్లో షికార్లు.. అంటే నాకు నాలుగైదు గుర్తొచ్చాయ్ అందులో ఏది అని అలీకి షాకిచ్చింది. ఇప్పటి వరకూ తాను ఏ అబ్బాయి బైక్ మీద తిరగలేదని బల్ల గుద్ది మరీ చెప్పింది.
సినిమాల్లోనూ హీరోయిన్గా రాణించాలని తెగ ట్రై చేస్తోన్న శ్రీముఖి బొద్దుగా ఉంటుంది కదా. కానీ పదో తరగతి పూర్తయ్యే సరికే ఆమె వంద కిలోల బరువు ఉండేదట. మామయ్యా పెళ్లికోసమని డైటింగ్ చేసి మరీ 8 నెలల్లోనే 40 కిలోల బరువు తగ్గిందట. శ్రీముఖి ఎప్పుడూ క్లాస్లో టాప్లో నిలిస్తే.. రవి మాత్రం లెక్కల్లో పాస్ కావడానికి డక్కా ముక్కీలు తినేవాడినని చెప్పాడు. శ్రీముఖిని డార్లింగ్ అని చెప్పిన రవి.. లాస్య గురించి అడిగితే.. ఇప్పుడెందుకు అని బదులిచ్చాడు.
శ్రీముఖికి చిన్నప్పుడు బలపాలు తినే అలవాటు ఉండేదట. ఈ విషయాన్ని ఆమెతోపాటు ఓ వీడియో క్లిప్ ద్వారా వాళ్లమ్మ కూడా చెప్పారు. అమ్మమ్మ వాళ్లింటికి వెళ్తే.. బలపాలు దొరికేవి కావనీ.. దాంతో మట్టి గోడల్ని గిల్లుకొని తినేదాన్ని అని శ్రీముఖి ముసిముసిగా నవ్వుతూ చెప్పింది.