యాప్నగరం

ఎవరీ రేలంగి సత్యవతి.. మహేష్ అంటే ఎందుకంత ఇష్టం

వాస్తవానికి వందేళ్లు పైబడిన వృద్ధులకు సినిమాలపై పెద్దగా ఆసక్తి ఉండదు. ఒకవేళ ఉన్నా అలనాటి హీరోలు ఎన్టీ రామారావునో, నాగేశ్వరరావునో ఇష్టపడతారు. కానీ ఈ బామ్మగారు మాత్రం నేటి తరం హీరో మహేష్‌బాబును ఆరాధించడం ఆశ్చర్యంగా ఉంది.

Samayam Telugu 26 Nov 2018, 12:22 pm
రేలంగి సత్యవతి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోన్న పేరు. కారణం, ఆమె సూపర్ స్టార్ మహేష్‌బాబును కలవడమే. ప్రిన్స్‌కు వీరాభిమాని అయిన ఈ 106 ఏళ్ల బామ్మగారు మహేష్‌బాబును ఒక్కసారి చూస్తే చాలనుకున్నారు. చనిపోయేముందు ఆయన్ని చూడాలన్నదే తన కోరిక అని పరితపించారు. సత్యవతి గురించి పలు మీడియా చానెళ్లలో కథనాలు రావడంతో ఈ విషయం మహేష్‌బాబుకు తెలిసింది. వందేళ్లు పైబడిన మహిళ తనను ఇంతగా అభిమానిస్తోందని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమెను కలవాలని నిర్ణయించుకున్నారు.
Samayam Telugu Mahesh2


వాస్తవానికి వందేళ్లు పైబడిన వృద్ధులకు సినిమాలపై పెద్దగా ఆసక్తి ఉండదు. ఒకవేళ ఉన్నా అలనాటి హీరోలు ఎన్టీ రామారావునో, నాగేశ్వరరావునో ఇష్టపడతారు. కానీ ఈ బామ్మగారు మాత్రం నేటి తరం హీరో మహేష్‌బాబును ఆరాధించడం ఆశ్చర్యంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సీటీఆర్ఐ కాలనీకి చెందిన సత్యవతికి 15 మంది సంతానం. ఈమెకు మరో 15 మంది మనవళ్లు, మనవరాళ్లు, ముని మనవళ్లు, ముని మనవరాళ్లు ఉన్నారు. ఇంట్లోనే ఉండే సత్యవతి టీవీలో వచ్చే సినిమాలు, సీరియళ్లు చూస్తూ ఉంటారు.
ఈ క్రమంలో ఇటీవల టీవీలో ‘భరత్ అనే నేను’ సినిమా చూసిన సత్యవతి అప్పటి నుంచి మహేష్‌బాబును ఆరాధించడం మొదలుపెట్టారు. మనవళ్లతో ఆయన ఫొటోను తెప్పించుకుని ఎప్పుడూ పక్కనే పెట్టుకునేవారు. మహేష్ ఫొటోను ముద్దాడుతూ మురిసిపోయారు. వాస్తవానికి ‘భరత్ అనే నేను’ సినిమా చూడకముందు మహేష్‌బాబు ఎవరో కూడా ఈ బామ్మగారికి తెలీదు. కానీ ఆ సినిమా చూసినప్పటి నుంచి ‘ముఖ్యమంత్రి బాబు’ అంటూ ఆయన్నే కలవరిస్తున్నారు. ఆమె బాధను చూడలేక కుటుంబ సభ్యులు మీడియా ద్వారా మహేష్‌కు ఈ విషయం తెలిసేలా చేశారు. మొత్తానికి తన వృద్ధ అభిమాని గురించి తెలుసుకున్న మహేష్.. రాజమహేంద్రవరం నుంచి ఆమెను హైదరాబాద్‌కు రప్పించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోన్న ‘మహర్షి’ షూటింగ్ సెట్‌లో సత్యవతిని మహేష్ కలిశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.