కొన్నుగీటి కుర్రహృదయాలను కొల్లగొట్టేసిన వింక్ గర్ల్, మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ తెలుగులో స్ట్రైట్ మూవీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రియా వారియర్ నటించిన ‘ఒరు ఆధార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఫిబ్రవరి 14న విడుదలకానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హైదరాబాద్ వచ్చిన ఈ సొగసరి చిన్నది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై లవ్ బుల్లెట్స్ ఎక్కుపెట్టి ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రియా వారియర్. ఇక తెలుగులో ఇదే ఊపు కొనసాగిస్తూ.. నేచురల్ స్టార్ నాని అప్ కమింగ్ మూవీ ఛాన్స్ కొట్టేసిందట ఈ కన్నుకొట్టుడు పిల్ల. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమా షూటింగ్లో ఉన్న నాని.. నెక్ట్స్ విక్రమ్ కె. కుమార్‌తో షూటింగ్‌కి వెళ్లనున్నారు. ఈ సినిమాలో నాని ప్లే బాయ్‌లో కనిపించనున్నట్టు వార్తలు వస్తుండగా.. ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయనున్నాడట నాని. ఈ ఐదుగురులో ఇప్పటికే మేఘాఆకాష్ని ఒక హీరోయిన్గా ఎంపిక చేయగా.. తాజాగా వింక్ గర్ల్ ప్రియా వారియర్‌ని రెండో హీరోయిన్గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఫిబ్రవరి 19 ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
Nani: ఆమె కన్నుగీటింది.. నాని పడిపోయాడు!!
ప్రస్తుతం ప్రియా వారియర్ నటించిన ‘ఒరు ఆధార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఫిబ్రవరి 14న విడుదలకానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హైదరాబాద్ వచ్చిన ఈ సొగసరి చిన్నది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై లవ్ బుల్లెట్స్ ఎక్కుపెట్టి ప్రేక్షకుల్ని ఫిదా చేయగా..
Samayam Telugu 28 Jan 2019, 1:51 pm
ప్రధానాంశాలు:
- నాని, విక్రమ్ కుమార్ మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్
- ప్లేబాయ్‌గా కనిపించనున్న నాని
- ఫిబ్రవరి 19న షూటింగ్ ప్రారంభం
- త్వరలో అధికారిక ప్రకటన