యాప్నగరం

పవన్‌ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ‘ఆడగాదు.. ఈడగాదు’ అంటూ పాట విడుదల

Bheemla Nayak: గురువారం (సెప్టెంబర్ 2వ) పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు జరుగనున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాల నుంచి అప్‌డేట్లు రానున్నాయి. అయితే ‘భీమ్లా నాయక్’ పవన్ పుట్టినరోజు ముందు రచయిత రామజోగయ్య శాస్త్రి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Samayam Telugu 2 Sep 2021, 6:46 am
మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్.‘వకీల్‌సాబ్’ అనే సినిమాతో ఈ మధ్యే ప్రేక్షకులను పలకరించిన పవన్‌.. ఆ తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. అందులో మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్ ‘భీమ్లా నాయక్’ ఒకటి. ఈ సినిమాలో రానా దగ్గుబాటి ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Samayam Telugu భీమ్లా నాయక్
Bheemla Nayak


ఇక గురువారం పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు జరుగనుంది. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్‌డేట్ల సునామీ రానుంది. క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి ఓ అప్‌డేట్, ఇక హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా టైటిల్ ప్రకటన గురువారమే జరుగనుందని టాక్. ఇక అన్నిటికంటే ప్రధానంగా ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి మొదటి పాట గురువారం విడుదల కానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే పవన్ పుట్టినరోజుకు ముందే అభిమానులకు రచయిత రామ జోగయ్య శాస్త్రి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

‘భీమ్లా నాయక్’ పాట ఫస్ట్ సింగిల్‌ లిరిక్స్‌ను ఆయన ట్విట్ చేశారు. ‘సెభాష్.. ఆడాగాదు.. ఈడాగాదు’ అంటూ ఈ పాట ఆరంభం అవుతోంది. ఈ లిరిక్స్ చూస్తుంటే ఇది భీమ్లా నాయక్ ఇంట్రో సాంగ్ అని స్పష్టంగా అర్ధం అవుతోంది. పాటలో పవన్‌కళ్యాణ్ హీరోయిజం అద్భుతంగా ఎలివేట్ అయ్యేలా లిరిక్స్ అందించారు. రామ జోగయ్యా శాస్త్రి. ఇక ఈ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.