యాప్నగరం

నాగబూబు కామెంట్లపై యండమూరి స్పందన

శనివారం గుంటూరులో జరిగిన ఖైదీ నం.150 చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి తమ్ముడు నాగబాబు ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మలపై నిప్పులు

Samayam Telugu 8 Jan 2017, 10:56 am
శనివారం గుంటూరులో జరిగిన ఖైదీ నం.150 చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి తమ్ముడు నాగబాబు ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మలపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ‘‘ఓ ప్రముఖ రచయిత, రచనా వ్యాసంగంలో ఆరితేరిన మూర్ఖుడు ఒకడున్నాడు. వాడంటే నాకు ఇప్పటికి గౌరవం. కనిపిస్తే కాళ్ళకు దండం పెడతాను. కాని వాడికి వ్యక్తిత్వ వికాసం లేదు. వాడు చరణ్ గురించి ఏవో చెత్త కామెంట్లు చేశాడు. వాడు వ్యక్తిత్వ వికాసం గురించి అందరికీ క్లాసులు చెప్పే ముందు.. కాస్త వ్యక్తిత్వం నేర్చుకుంటే బెటర్’’ అంటూ యండమూరిపై ఫైర్ అయ్యాడు నాగబాబు.
Samayam Telugu yandamoori reacts on nagababus comments at khaidi function
నాగబూబు కామెంట్లపై యండమూరి స్పందన


అటు వర్మపై ఫైర్ అయ్యారు. ఆయన విసిరే వేస్ట్ ట్విట్ల బాంబులు ముంబైలో విసురుకోవాలని సలహా ఇచ్చారు. అయితే నాగబాబు సభలో మాట్లాడిన కొద్ది సేపటికే వర్మ ట్విట్టర్లో తెలుగు, ఇంగ్లిష్ లో స్పందించారు. తెలుగులో క్షమాపణ చెప్పడం ఇంగ్లిష్ లో మళ్లీ కౌంటర్ రిప్లై ఇవ్వడం జరిగిపోయాయి.
ఇక, యండమూరి మాత్రం ఇవేవీ చేయకుండా...నాగబాబు కామెంట్లపై కాల్ గా స్పందించారు. అసలు నాగబాబు ఎందుకు అలా ఎందుకు మాట్లాడారో తనకు అర్ధం కావడం లేదన్నారు. ‘‘ఇటీవలే మేమిద్దరం ఓ ఫంక్షన్ లో కలిసాం. గురువు గారు అంటూ నన్ను ఆప్యాయంగా పలకరించి ఓ కథ ఉంటే చెప్పమని అన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఆవేశంతో ఆ మాటలు ఎలా అన్నాడో అర్దం కావడంలేదని’’ యండమూరి తన సన్నిహితుల వద్ద వాపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.