యాప్నగరం

చిరు రియాల్టీ షో‌పై యండమూరి సంచలన కామెంట్స్!

ఒకప్పుడు మంచి మిత్రులుగా మెలగిన మెగాస్టార్ చిరంజీవి, రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌లకు ప్రస్తుతం ఏమాత్రం పొసగటం లేదు. గతంలో రామ్ చరణ్‌పై యండమూరి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, దానికి నాగబాబు ఘాటుగా స్పందిచడం ఆ వివాదాం సద్దుమణిగింది.

TNN 24 Feb 2017, 1:37 pm
ఒకప్పుడు మంచి మిత్రులుగా మెలగిన మెగాస్టార్ చిరంజీవి, రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌లకు ప్రస్తుతం ఏమాత్రం పొసగటం లేదు. గతంలో రామ్ చరణ్‌పై యండమూరి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, దానికి నాగబాబు ఘాటుగా స్పందిచడం ఆ వివాదాం సద్దుమణిగింది. అయితే తాజాగా చిరంజీవినే లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' టీవీ ప్రోగ్రామ్‌‌తో జనాల్ని దోచుకుంటున్నారని పరోక్షంగా యండమూరి అభివర్ణించాడు.
Samayam Telugu yandamuri veerendranath comments on meelo evaru koteeswarudu
చిరు రియాల్టీ షో‌పై యండమూరి సంచలన కామెంట్స్!


ఆ కార్యక్రమం అతి పెద్ద మోసమని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పోటీలో పాల్గోడానికి ముందు మూడు మెసేజ్ లు పంపాల్సి ఉంటుంది, ఒక్కో మెసేజ్‌కు రూ.5 ఛార్జ్ అవుతుందని చెప్పారు. అంటే, ఒక్కొక్కరు రూ.15 చెల్లిస్తారని, ఇలా 10 లక్షల మంది మెసేజ్‌లు పంపితే, నిర్వాహకులకు రూ. 1.5 కోట్లు దక్కుతాయని తెలిపారు. ఆ తర్వాత కుక్కలకు బిస్కెట్లు విసిరినట్లు పోటీల్లో పాల్గొన్నవారికి రూ.5 లక్షలు, రూ.6 లక్షలు పడేస్తారని మండిపడ్డారు. వాటిని మనం చొంగ కార్చుకుంటూ తీసుకుంటున్నామని యండమూరి విమర్శించారు.

నిరుపేదలు కూడా ఎంతో ఆశతో ఈ కార్యక్రమానికి మెసేజ్‌లు పంపుతున్నారని యండమూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకంటే మోసం మరొకటి లేదని, దీని కంటే లాటరీ టికెట్ కొనుక్కోవడం ఉత్తమమని సలహా ఇచ్చారు. లాటరీలను బ్యాన్ చేసినట్టే, ఇలాంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వాలు నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.