యాప్నగరం

ఒకే హీరో రెండు పార్టీల తరఫున ప్రచారం!

సినిమా వాళ్ల రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. ప్రత్యేకించి కర్ణాటకలో అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినిమా వాళ్ల తీరు

Samayam Telugu 3 May 2018, 2:24 pm
సినిమా వాళ్ల రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. ప్రత్యేకించి కర్ణాటకలో అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినిమా వాళ్ల తీరు ఆసక్తిదాయకంగా మారింది. ఉపేంద్ర రాజకీయ పార్టీ పెట్టడం, ఆ వెంటనే ఆ పార్టీకి తనే రాజీనామా చేయడం, ఇక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా అంబరీష్ పోటీకి నిరాకరించడం, గతంలో జేడీఎస్ నుంచి బయటకు వెళ్లిపోయిన పూజాగాంధీ తిరిగి అదే పార్టీలోకి చేరడం.. ఇలాంటి సినీ రాజకీయాలు సాగుతున్నాయక్కడ.
Samayam Telugu yash


అవే అనుకుంటే మరి కొన్ని చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి కన్నడనాట. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి దిగిన కన్నడ హీరో యశ్ తీరు ఆసక్తిదాయకంగా ఉంది. రాజకీయాల వైపు వచ్చే సినిమా వాళ్లు ఏదైనా ఒక పార్టీకి మద్దతును ఇవ్వడాన్ని చూస్తూ ఉంటాం. అయితే యశ్ మాత్రం ప్రత్యర్థులుగా పోరాడుతున్న రెండు పార్టీలకూ మద్దతు ప్రకటించాడు. ఆ పార్టీల తరఫున తను ప్రచారం చేస్తానని ఈ హీరో ప్రకటించాడు. ఇప్పటికే ఒక పార్టీ తరఫున ప్రచారం చేశాడు కూడా.

అటు జేడీఎస్, ఇటు బీజేపీ.. ఈ రెండు పార్టీల తరఫునా యశ్ ప్రచారం చేస్తానని అంటున్నాడు. ఇప్పటికే జేడీఎస్ తరఫున ఈ హీరో ప్రచారం చేయడం కూడా చేశాడు. మైసూరు ప్రాంతంలోని ఒక నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి తరఫున యశ్ ప్రచారం చేశాడు. అయితే ఇతడి ప్రచారం అంతటితో ఆగడం లేదు. అదే ప్రాంతంలోని మరో నియోజకవర్గంలో ఒక బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి యశ్ రెడీ అవుతున్నాడు.

ఇలా రెండు వేర్వేరు పార్టీల తరఫున ఒకే ఎన్నికల్లో ఒకే జిల్లాలో ప్రచారం చేయడం యశ్ ప్రత్యేకత అని చెప్పాలి. తనకు పార్టీలతో పనిలేదని, అభ్యర్థులతోనే పని అని, వారిని పరిగణనలోకి తీసుకుని ప్రచారం చేస్తున్నట్టుగా యశ్ చెప్పుకొస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.