యాప్నగరం

లగడపాటి కుమారుడు హీరోగా ‘ఎవడు తక్కువకాదు’

లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘ఎవడు తక్కువ కాదు’. విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అన్నది ఉపశీర్షిక.

Samayam Telugu 22 Mar 2019, 8:03 pm
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో అల్లు అర్జున్ ప‌వ‌ర్‌ప్యాక్డ్ ఫ‌ర్‌ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేశారు. బన్నీతో పాటు అదే సినిమాలో నటుడిగా మెరిసిన మరో యువకుడు విక్రమ్ సహిదేవ్. సినిమా పతాక సన్నివేశాలను భావోద్వేగ భరితంగా మార్చేశాడు. అన్వర్ పాత్రలో విక్రమ్ సహిదేవ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతకు ముందు ‘రేసుగుర్రం’లో అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రలో మెప్పించాడు. ఇప్పుడీ కుర్రాడు ఓ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఇంతకీ ఈ కుర్రాడు నిర్మాత లగడపాటి శ్రీధర్ పెద్ద కుమారుడు.
Samayam Telugu Yevadu_Thakkuvakadu


లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘ఎవడు తక్కువ కాదు’. విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అన్నది ఉపశీర్షిక. రఘు జయ దర్శకుడు. ఈ సినిమా టైటిల్ ప్రకటించడంతో పాటు తాజాగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అలాగే మోషన్ పోస్టర్‌ను కూడా తీసుకొచ్చారు. ఫస్ట్ లుక్‌లో విక్రమ్ సహిదేవ్ ప‌వ‌ర్‌ఫుల్ ఎక్స్‌ప్రెష‌న్‌తో మెప్పిస్తున్నాడు.

మోషన్ పోస్టర్ విడుదల సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్ అనే ఉప శీర్షిక ప్రధాన పాత్రలో నటిస్తున్న విక్రమ్ సహిదేవ్ క్యారెక్టర్‌కు ఫ‌ర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. న్యూ ఏజ్ రివెంజ్ డ్రామా ఇది. బాల నటుడిగా ఆకట్టుకున్న మా విక్రమ్ సహిదేవ్, కథకు తగ్గట్టు వైవిద్యమైన పాత్రలో కనిపిస్తాడు. యాక్షన్‌తో పాటు అందమైన టీనేజ్ ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. ‌మా సంస్థలో ఇది ఓ మంచి సినిమాగా నిలవటంతో పాటు, విక్రమ్‌కు మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకంగా ఉన్నాం’ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.