యాప్నగరం

అరడజను సినిమాలు లైన్‌లో పెట్టిన కుర్రహీరో!

‘పెళ్ళిచూపులు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ.

TNN 28 Feb 2017, 12:12 pm
‘పెళ్ళిచూపులు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా 'ద్వారక' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ కుర్ర హీరో.. తరవాత 'అర్జున్ రెడ్డి' సినిమాతో వస్తున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా టీజర్ ఇప్పటికే ఆకట్టుకుంటోంది. విజయ్ కూడా టీజర్‌లో చాలా అగ్రెసివ్‌గా కనిపించాడు. ఇదే దూకుడును తన రియల్ లైఫ్‌లో కూడా చూపిస్తూ వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు.
Samayam Telugu young hero vijay devarakonda busy with six projects
అరడజను సినిమాలు లైన్‌లో పెట్టిన కుర్రహీరో!


ముందుగా గీతా ఆర్ట్స్‌లో రాహుల్ అనే కొత్త దర్శకుడితో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌లో నటించబోతున్నాడు. అదే బ్యానర్‌లో పరశురామ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. వచ్చే నెల నుంచి ఈ సినిమా మొదలుకానుంది. దీని తరువాత నందిని రెడ్డి డైరెక్షన్‌లో ఓ సినిమా, అలానే భరత్ కమ్మ, క్రాంతి మాధవ్, దేవకట్టాలతో మరో మూడు సినిమాలు ప్లాన్ చేశాడు. దీంతో ఈ యంగ్ హీరో రెమ్యూనరేషన్ కూడా కోటి రూపాయలకి చేరింది. ఈ అరడజను సినిమాల్లో నాలుగు సినిమాలు హిట్ అయినా సరే స్టార్ హీరోల రేసులోకి విజయ్ కూడా చేరిపోవడం ఖాయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.