యాప్నగరం

పవన్‌పై వ్యక్తిగత దూషణలు పద్దతి కాదు: రోజా

సొంత లాభం కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేయడం మంచిది కాదన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన ఆమె... టాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు.

Samayam Telugu 22 Apr 2018, 1:45 pm
సొంత లాభం కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేయడం మంచిది కాదన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన ఆమె... టాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ఇండస్ట్రీలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయొచ్చని గుర్తు చేశారు రోజా. వ్యక్తిగతంగా ఎవరినైనా విమర్శిస్తే ఊరుకునేది లేదని... పార్టీలను కూడా పక్కన పెట్టి ఇండస్ట్రీ మొత్తం ఏకమవుతుందన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ విషయంలో రాజకీయంగా విమర్శలు చేయొచ్చు కాని... కుటుంబ సభ్యుల్ని కూడా ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పవన్‌ను కుట్రపన్ని బజారుకు లాగుతున్నారని... కొన్ని ఛానల్స్‌తో ఎందుకు టార్గెట్ చేస్తున్నారో చెప్పాలన్నారు.
Samayam Telugu Roja


కాస్టింగ్ కౌచ్ విషయంలో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణను ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు రోజా. ఏపీ సీఎం వియ్యంకుడిగా ఉన్న ఆయన దీనిపై ఎందుకు స్పందించలేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.