యాప్నగరం

వెంకీ మామనే ఆ కథని సూచించారు: చైతూ

ఇటీవలే రారండోయ్ వేడుక చూద్దాం మూవీతో సక్సెస్ కొట్టిన జోష్‌లో వున్న నాగచైతన్య ప్రస్తుతం యుద్ధం శరణం సినిమాతో....

TNN 9 Jul 2017, 8:23 pm
ఇటీవలే రారండోయ్ వేడుక చూద్దాం మూవీతో సక్సెస్ కొట్టిన జోష్‌లో వున్న నాగచైతన్య ప్రస్తుతం యుద్ధం శరణం సినిమాతో మరోసారి ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈమధ్యే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కనిపించింది. కృష్ణ మరిముత్తు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గురించి మాట్లాడుతూ... వెంకీ మామనే తనకి ఈ స్క్రిప్ట్‌ని సూచించినట్టు తెలిపాడు చైతూ. సాధారణంగా చైతూ నటించే సినిమాల స్క్రిప్టులకి నాగ్ సహకారం అందిస్తుంటాడట. కానీ ఈసారి యుద్ధం శరణం స్క్రిప్ట్ మాత్రం వెంకీనే స్వయంగా చైతూకి సజెస్ట్ చేశాడట.
Samayam Telugu yuddham sharanams script suggested by venkatesh uncle chaitu
వెంకీ మామనే ఆ కథని సూచించారు: చైతూ


వారాహీ చలన చిత్రం బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన లావణ్యా త్రిపాఠీ జంటగా నటిస్తోంది. శ్రీకాంత్, రావు రమేష్, రేవతి వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాలేజీ డ్రాపౌట్ అయిన ఓ యువకుడు డ్రోన్స్ తయారు చేసేస్థాయికి చేరడం ఈ చిత్ర కథాంశంలో ఓ భాగమని తెలుస్తోంది.

ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దాం మూవీతో ఈ ఏడాది ఓ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న చైతూ యుద్ధం శరణం మూవీతో మరో హిట్‌ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వెంకీ అతడికి అందించిన సలహా ఏమేరకు ఉపయోగపడనుందో వేచిచూడాల్సిందే మరి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.