యాప్నగరం

Wild Dog Ott Release: నాగార్జున 'వైల్డ్ డాగ్'కి భారీ ఆఫర్.. ఓటీటీ లోనే రిలీజ్!

నాగార్జున ప్రధాన పాత్రలో రూపొందిన 'వైల్డ్ డాగ్' సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్ లభించిందని, దీంతో దర్శకనిర్మాతలు ఈ చిత్రాన్ని ఓటీటీ లోనే రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారని సమాచారం.

Samayam Telugu 27 Nov 2020, 9:03 am
లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ మూతబడటంతో పలు సినిమాల విడుదల వాయిదాపడి ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ కరువైంది. దీంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఓటీటీ సంస్థలు భారీ సినిమాలను కొనుగోలు చేసి విడుదల చేస్తున్నాయి. మరోవైపు థియేటర్స్ లేక చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. నాని V, అనుష్క 'నిశ్శబ్దం' లాంటి పెద్ద సినిమాలు కూడా ఆన్‌లైన్ వేదికలపైనే విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే మరో భారీ సినిమా 'వైల్డ్ డాగ్' కూడా ఓటీటీ లోనే రిలీజ్ కాబోతోందని తెలిసింది.
Samayam Telugu నాగార్జున వైల్డ్ డాగ్కి భారీ ఆఫర్.. ఓటీటీ లోనే రిలీజ్
Nagarjuna Wild Dog


నాగార్జున హీరోగా తెరకెక్కిన 'వైల్డ్ డాగ్' సినిమా ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకుంది. దీంతో త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని చూస్తున్నారు మేకర్స్. మరోవైపు ప్రస్తుతం థియేటర్లు తెరవడానికి అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ తరుణంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి 'వైల్డ్ డాగ్' మూవీకి భారీ ఆఫర్ దక్కిందట. దీంతో చిత్ర దర్శకనిర్మాతలు అటువైపుగా మొగ్గు ఓటీటీలో విడుదల చేసేందుకు రెడీ అయ్యారని టాక్.

Also Read: క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన జబర్దస్త్ బ్యూటీ.. షర్ట్ బటన్స్ విప్పేసి పీక్స్‌లో అందాల ఆరబోత!

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిసోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నాగార్జున గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలో పని చేసే విజయ్‌వర్మ అనే ఏజెంట్‌గా ఆయన నటించారు. ఇక ఈ చిత్రంలో నాగార్జున సరసన దియామీర్జా నటిస్తున్నారు. సయామీ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ మూవీ నిర్మిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.